అరడజను ఎంపీ సీట్లపై కమలనాథుల కన్ను.. ఏపీలో ఆశలు నెరవేరేనా?
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని తలపోస్తున్న బీజేపీ నాయకులు.. ఆ వ్యూహానికి తగిన విధంగానే ప్రణాళి క సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ వంటి రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న రాష్ట్రం లో తమ పట్టు పెంచుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను కూడా నాయకులు లెక్కలు వేసుకుంటున్నా రు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. గెలుపు గుర్రం ఎక్కాలని.. సత్తా చాటాలని.. రాష్ట్ర బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలని అనుకున్నారు. అయితే.. అవి ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. బీజేపీ అధిష్టానం.. వైసీపీకి అనుకూలంగా ఉండడం.. రాష్ట్ర నాయకత్వం.. మరో లా భావిస్తుండడంతో పరిస్థితి పొత్తులపై ప్రభావం చూపుతోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరి ప్రయాణం చేయడమే బెటర్ అని రాష్ట్ర కమలనాథులు డిసైడ్ అయ్యారు. అందుకే ఇటీవల కాలంలో వారి టోన్.. తరహా.. అన్నీ మారిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని.. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడతామని..వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేలా శ్రేణులను సిద్ధం చేస్తామని.. బీజేపీ నాయకులు.. పురందేశ్వరి, సత్యకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, సోము వీర్రాజు వంటివారు చెబుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఎలా ఉన్నా.. కేంద్రంలో పార్టీని బలోపేతం చేశామన్న సంకేతాలు ఇచ్చేలా.. కనీసం 6 పార్లమెంటు స్థానాలు గెలిచి మోడీకి బహుమతిగా ఇవ్వాలని.. రాష్ట్ర నాయకత్వం రెడీ అవుతున్నట్టు గుసగుస వినిపిస్తోంది.
గతంలో తాము గెలిచిన సీట్లను ఈసారి మళ్లీ గెలవాలని రాష్ట్ర నాయకులకు లక్ష్యంగా పెట్టుకున్నారని.. దీనికి కేంద్రం నుంచి కూడా కొన్ని ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. వీటిలో నర్సాపురం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ సహా నరసరావుపేట లేదా గుంటూరు సీటుపై కూడా వారు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 1998లో బిజెపి స్వంతంగా తిరుపతి, కాకినాడల్లో విజయం సాధించింది. ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకుని తిరుపతి, నర్సాపూర్, రాజమండ్రిల్లో గెలుపొందింది.
2014లో విశాఖ, నరసాపురం ఎంపీ స్థానాలను పొత్తులో కైవసం చేసుకుంది. ఇక, ఇప్పుడు వీటితో పాటు.. మరో నాలుగు చోట్ల విజయం దక్కించుకుని.. మోడీకి కానుకగా ఇచ్చే పక్కా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికిగాను.. ప్రజల్లోకి వెళ్లడం.. ఆ ఆరు చోట్ల కీలకమైన నాయకులను రంగంలోకి దింపడంపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.