• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీజేపీ ఆశలన్నీ 'ఆమె'...

బీజేపీ ఆశలన్నీ 'ఆమె' మీదేనా ?

By - Tupaki Desk
Update: 2022-02-05 04:43 GMT
ఉత్తరప్రదేశ్ మొదటి విడత పోలింగ్ సందర్భంగా బీజేపీ ఆశలన్నీ బీఎస్పీ అధినేత్రి మాయావతి మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లుంది. యూపీ పశ్చిమ ప్రాంతంలో 128 సీట్లున్నాయి. వీటిల్లో 58 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ జరగబోతోంది. 128 సీట్లలో జాట్లు, ముస్లింలదే ప్రాబల్యం. పై రెండు సామాజిక వర్గాలు గట్టిగా అనుకుని ఏకతాటిపై నిలిస్తే అంతే సంగతులు. ఈ రెండు సామాజిక వర్గాలు ఎవరికి ఓట్లేయాలని అనుకుంటే మిగిలిన పార్టీలకు పెద్ద దెబ్బనే చెప్పాలి.

క్షేత్రస్ధాయిలోని జనాల మూడ్ చూస్తే జాట్లు, ముస్లింలు వివిధ కారణాలతో బీజేపీ మీద మండిపోతున్నారు. కాబట్టి సహజంగానే వాళ్ళ ఓట్లలో మెజార్టీ బీజేపీ ప్రత్యర్ధులకు పడే అవకాశాలే ఎక్కువ. ఇక్కడ ప్రత్యర్ధి అంటే ప్రధానంగా ఎస్పీ కూటమే. అయితే ఇంతకాలం స్తబ్దుగా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్ల కేటాయింపులో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఎస్పీ+ఆర్ఎల్డీ కూటమి తరపున 15 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

వీళ్ళని దెబ్బకొట్టడానికి మాయావతి కూడా సరిగ్గా అనే నియోజకవర్గాల్లో ముస్లింలనే రంగంలోకి దింపింది. బీఎస్పీకి తోడు ఎంఐఎం కూడా పూర్తిగా ముస్లింలనే పోటీచేయిస్తోంది. అంటే 15 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్ధుల మధ్యే ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది. బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా హిందువులకే టికెట్లిచ్చింది. ముస్లింల మధ్య ఓట్లు చీలిపోయి తమకు లాభిస్తుందనేది బీజేపీ అంచనా. అయితే ఇప్పటికే బీఎస్పీ అంటే బీజేపీకి బీ టీమ్ అనే ప్రచారం ఉంది.

బీఎస్పీ మీదున్న ప్రచారం కారణంగా కేవలం ముస్లింల ఓట్లు చీల్చేందుకే మాయావతి ప్రయత్నిస్తున్నారని ఎస్పీ+ఆర్ఎల్డీ కూటమి ఆరోపిస్తోంది. వీళ్ళ ఆరోపణల్లో నిజముందని ముస్లింలు ఏకీభవిస్తే ముస్లింల ఓట్లు ఏకపక్షంగా ఎస్పీ+ఆర్ఎల్డీ కూటమికి పడుతుంది. అలాకాకుండా ముస్లింల్లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఓట్లేసుకోవాలని అనుకుంటే కచ్చితంగా బీఎస్పీకి కూడా పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి. అప్పుడు ముస్లిం ఓట్లలో  చీలిక తప్పదు. అందుకనే మాయావతి పార్టీ చీల్చే ఓట్లపైనే బీజేపీ ఆశలు పెట్టుకుందట. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Tags:    
  • mayawati 
  • mayawati silence 
  • Akhilesh yadav 
  • Bsp Paty 
  • Uttar Pradesh Assembly elections 
  • Uttar Pradesh Assembly elections 2022 
  • Uttar Pradesh 

Similar News

ఏఐ యుగంలో మనుషుల పని మారనుందా? ఉద్యోగాల నుంచి ప్రకృతి, సంస్కృతి వైపు కొత్త ప్రయాణం..

2026-11-23 12:28 GMT

'వ‌ర్మ‌' గారి గుండెల్లో గుబులు.. రీజ‌న్ ఇదే.. !

2026-11-23 11:26 GMT

సిటీకి పోటీగా పల్లెటూళ్లలో పెళ్లిళ్లు.. లక్షల్లో ఖర్చులు!

2026-11-23 11:03 GMT

ప్రేమ కోసం 3,200 కిలోమీటర్ల బైక్ ప్రయాణం.. రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో ఇదే హైలెట్..

2026-11-23 11:03 GMT

'పేపకాయల' వాళ్లు.. కలిసి దుమ్ములేపారు..

2026-11-23 11:02 GMT

ట్రంప్ ప్రేమలేఖను కనీసం కవర్ కూడా చించకుండా వెనక్కి పంపిన కిమ్

2026-11-23 08:10 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

2026-11-23 07:03 GMT

చిన్నా పెద్దా ఇష్టపడే ఈ ఫుడ్‌తో గుండెకు ముప్పు!

2026-11-23 05:46 GMT

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

బిస్లరీ వాటర్‌లో రసాయనాలు.. పరీక్షల్లో బయటపడిన లోపాలు

2026-11-23 04:36 GMT

ఎన్విడియా చిప్స్ చైనాకు తరలింపు.. లీ మింగ్ పేరు బయటకు!

2026-11-23 04:35 GMT

Copyright @2026

Powered by Blink CMS