మమతా బెనర్జీని హిజ్రాతో పోల్చిన బీజేపీ నేత

Update: 2017-05-01 09:39 GMT
   
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆ  రాష్ట్ర బీజేపీ ప్యానెల్ సభ్యుడు శ్యామపాద మండల్  పశ్చిమ మిడ్నాపూర్‌ లో జరిగిన బీజేపీ ప్రచార సభలో మాట్లాడుతూ... మమతా బెనర్జీ ఒక హిజ్రా అని ఎద్దేవా చేశారు. ముస్లింలు వారి మత సంప్రదాయల్లో భాగంగా ఎలా చేస్తారో అలాంటి పనులే మమత చేస్తున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  దీంతో ఇది పెను దుమారంగా మారిపోయింది.
    
మమతా బెనర్జీ అసలు స్త్రీనా? లేక పురుషుడా? అన్న విషయం తమకు అర్ధం కావడం లేదంటూ ఆయన  దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.  అంతే కాకుండా ఆమె ఒక హిజ్రా అని తాను చెప్పగలనని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
    
కాగా శ్యామపాద వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆరోపణలు, పెద్ద పెద్ద తప్పులతో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. కాగా బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దీనిపై స్పందిస్తూ అలాంటి పదాలను మహిళల విషయంలో ఉపయోగించడం ఎంతమాత్రం కరెక్టు కాదని... మండల్ కు షోకాజ్ నోటీసు ఇస్తామని ఆయన చెప్పారు. అయితే.. ఇంతవరకు పార్టీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News