మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన భార్య మెలిందా గేట్స్ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన ప్రపంచం నివ్వెరపోయింది. 65 సంవత్సరాల వయసున్న బిల్ గేట్స్, 56 ఏళ్ల వయసున్న మెలిందా ఈ వయసులో విడిపోవడం ఏంటనేది ఎవ్వరికీ అర్థం కాలేదు.
ఆ తర్వాత జరిగిన ప్రచారం ప్రకారం.. అందరి చూపూ బిల్ గేట్స్ మాజీ ప్రేయసి అన్ విన్ బ్లాడ్ వైపు మళ్లింది. దీంతో.. దశాబ్దాల కాలం నాటి వీళ్ల లవ్ స్టోరీ.. ప్రపంచం మొత్తం ఇప్పుడు చదివేసింది. అంతేకాదు.. తన ప్రేమ సంగతి భార్య మెలిందాకు చెప్పిన బిల్ గేట్స్.. పెళ్లైన తర్వాత కూడా ఆమెను కలిసే ఒప్పందం ఒకటి చేసుకున్నాడనే వార్తలు వచ్చేశాయి. దీంతో.. వీరి విడాకులకు ఈమే కారణం కావొచ్చనే ప్రచారం సాగింది. కానీ.. లేటెస్ట్ న్యూస్ మరో విషయం చెబుతోంది.
బిల్ గేట్స్ గతేడాది మార్చి 13న మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ బాధ్యతలు పూర్తిస్థాయిలో చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ.. అసలు విషయం అది కాదట. ఓ ఉద్యోగినితో బిల్ గేట్స్ ఏకంగా రాసలీల కార్యక్రమం మొదలు పెట్టాడట. ఈ విషయం బయటకు తెలియడంతో.. బోర్డు సభ్యుల ఒత్తిడి మేరకే రాజీనామా చేశాడట. ఈ మేరకు ప్రఖ్యాత ది వాల్ స్ట్రీట్ జర్నల్ స్పెషల్ ఎడిషన్ ప్రచురించింది.
ఈ వ్యవహారం 2019లో బయటపడిందట. సదరు మహిళకు ఇష్టం లేకపోయినా గేట్స్ బలవంత పెట్టాడని అంటున్నారు. బాధితురాలు స్వయంగా బోర్డుకు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగు చూసిందట. నిజ నిర్ధారణ కోసం విచారణ చేయిస్తే.. వాస్తవమేనని తేలిందట. దీంతో.. బోర్డు సభ్యులు మొత్తం కలిసి బిల్ గేట్స్ ను బయటకు సాగనంపారట.
ఈ ఘటన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే.. బిల్ గేట్స్ - మెలిందా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మనసులు విరిగిపోయిన తర్వాత కలిసి ఉండలేమనే ఉద్దేశంతోనే.. ఈ వయసులో కూడా విడాకులకు సిద్ధపడ్డారట. మరి, ఇందులో వాస్తవం ఎంత అన్నది బిల్-మెలిందాలే చెప్పాలి.