మోడీ అనుకున్నట్లే.. అతడు దెబ్బ తిన్నాడు.. ప్రత్యర్థిని దెబ్బ తీశాడు
మోడీ రాజకీయం చాలా సిత్రంగా ఉంటుంది. తన చేతికి మట్టి అంటకుండా ఆయన సంధించే అస్త్రాలకు ప్రత్యర్థులు అడ్డంగా బుక్ అవుతుంటారు. కాలం కలిసి రావటం అంటే ఇదేనేమో? తాజాగా ఫలితాలు వెల్లడైన బిహార్ రాష్ట్రఅసెంబ్లీ ఎన్నికల్ని చూస్తే.. జేడీయూకి మిత్రుడిగా ఉండే ఎల్ జీపీ (లోక్ జనశక్తి పార్టీ) కూటమి నుంచి బయటకు రావటం ద్వారా తనను తాను మునిగిపోయారు. అదే సమయంలో తాను పంతం పట్టిన ఒకప్పటి మిత్రుడు నితీశ్ ను అడ్డంగా బుక్ చేశారు.
మోడీ ఆడిన చదరంగంలో చిరాగ్ పాస్వాన్ పావులా మారారన్న వాదన వినిపిస్తోంది. జేడీయూతో కలిసి పోటీ చేయటం వల్ల ఇరువురు లాభ పడుతుంటారు. అయితే.. సీట్ల పంపంకంలో వచ్చిన తేడాతో.. నితీశ్ తో విభేదించి కూటమి నుంచి బయటకు వచ్చి.. తనకు తానుగా సొంతంగా పోటీ చేశారు. బీజేపీ బరిలో ఉన్న చోట్ల తన అభ్యర్థుల్ని పోటీకి పెట్టని చిరాగ్.. నితీశ్ పార్టీ రంగంలో ఉన్న చోట్ల మాత్రం అభ్యర్థుల్ని దించారు. దీని కారణంగా తాను ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నాడుకానీ.. నితీశ్ ను 30 స్థానాల్లో ఓడేలా చేశారు.
దీంతో.. గత ఎన్నికల్లో గణనీయమైన సీట్లను సొంతం చేసుకున్న నితీశ్.. ఈసారి అందుకు భిన్నంగా పెద్దగా సీట్లు గెలుచుకోలేని పరిస్థితి. దీంతో.. ఎన్డీయే కూటమిలో ఒకప్పుడు తిరిగులేని అధిక్యతను ప్రదర్శించిన నితీశ్.. ఇప్పుడు బీజేపీకి వచ్చిన సీట్ల ముందు వెలవెలపోతున్నారు. దీని వల్ల చిరాగ్ వచ్చే ప్రయోజనం ఏమిటన్నది అర్థం కాని పరిస్థితి. మొత్తంగా నితీశ్ ను దెబ్బ తీసే ప్రయత్నంలో తాను దెబ్బ తిన్నా.. పట్టనట్లుగా వ్యవహరించే ఆయన ధోరణి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మోడీ కదిపిన పావులకు తగ్గట్లే చిరాగ్ వ్యవహరించారన్న విమర్శ ఉంది. అదెంత వరకు నిజమన్న విషయం రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు.