బీహార్ ఎన్నికల సర్వే : గెలుపు వారిదే?

Update: 2020-10-21 04:15 GMT
బీహార్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అక్టోబర్ 28న జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నితీష్ గెలుస్తాడా? ప్రతిపక్ష ఆర్జేడీ కూటమి గెలుస్తుందా అన్న ఉత్కంఠ రాజ్యమేలుతోంది.

ఈ క్రమంలోనే లోక్ నీతి సీఎస్డీఎస్ సర్వే బీహార్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే దానిపై సర్వే చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.  బీహార్ ఎన్నికల్లో  మొత్తం 243 సీట్లలో బీజేపీ-జేడీయూ సారథ్యంలోని ఎన్డీయే కూటమి  133-143 స్థానాలు సాధించి అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పింది.

ఇక ఆర్జేడీ -కాంగ్రెస్ కూటమి 88-98 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలుస్తుందని తేల్చింది. లోక్ జనశక్తి పార్టీకి 2-6 స్థానాలు.. ఇతరులకు 6-10 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనావేసింది.

ఓటు బ్యాంకును పరిశీలిస్తే ఎన్డీఏకి 28 శాతం, మహాకూటమికి 32 శఆతం, జీడీఎస్ఎఫ్ కి 7శాతం, ఎల్.జే.పీకి 6శాతం, ఇతరులను 17శాతం పోల్ అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనావేసింది.

అయితే లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వేలో ఎన్డీఏ ముఖ్యమంత్రి కూటమి అభ్యర్థి నితీష్ కుమార్ కు ఎదురుగాలి వీస్తుందని  తేలింది. 2010లో 91శాతం బీజేపీ ఓటర్లు నితీష్ సీఎం కావాలని తెలుపగా.. ఇప్పుడు అది 55శాతానికి పడిపోయినట్లు సర్వే తేల్చింది.

2015లో నితీష్ కు పాపులారిటీ 40శాతం, లాలూ పాపులారిటీ 9శాతం ఉండగా.. ఇప్పుడది నితీష్ కు 31శాతానికి పడిపోయింది. అదే సమయంలో లాలూ పాపులారిటీ 30శాతానికి పెరిగిందని సర్వేలో తేలింది. నితీస్ కు లాలూ ఫ్యామిలీ దెబ్బ తీసిందని తేలింది.

ఇక నితీష్ పాలనపై 2015లో 80శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడదని 50శాతానికి పడిపోయింది.

15 ఏళ్లుగా బీహార్ సీఎంగా పనిచేస్తున్న నితీష్ వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ఈసారి విజయం సాధిస్తే అది బీజేపీ, మోడీ చలువే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News