రాజధానిలో దారుణం.. బీజేపీ నేతను కాల్చిచంపారు

Update: 2020-10-02 03:45 GMT
బీహార్ లో మళ్లీ పాత అరాచకం మొదలైంది. బీహార్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తేది ప్రకటించడంతో అక్కడ ముఠా కక్షలు పెచ్చరిల్లాయి.

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దారుణం  చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నడిబొడ్డున బీజేపీకి చెందిన ఓ నేతను దుండగులు కాల్చి చంపారు.

బీజేపీ నేత రాజేశ్ జా మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అత్యంత సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నాయి.

ఇటీవలే పాట్నాకు చెందిన రాజేశ్ కుమార్ జా బీజేపీలో చేరారు. ఆయనపై ప్రత్యర్థులు కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

రాజేశ్ కు బాగా తెలిసిన వ్యక్తులే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఏకంగా అధికార బీజేపీనేతను కాల్చి చంపడం ఉద్రిక్తతకు దారితీసింది.
Tags:    

Similar News