అఖిల ప్రియ తీర్పు.. అన్న వైపా, చెల్లి వైపా?

Update: 2017-04-24 07:15 GMT
భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. భూమా కుటుంబానికే ఈ  టిక్కెట్ దక్కాలని ఆయన కుమార్తె అఖిలప్రియ.... కాదు, తనకే ఇవ్వాలంటూ శిల్పా మోహనరెడ్డి పట్టుపడుతున్నారు. ఇది చాలదన్నట్లు భూమా కుటుంబంలోనూ ఈ టిక్కెట్ ను ఇద్దరు ఆశిస్తున్నారు. అఖిల ప్రియ తన సోదరికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతుండగా.. భూమా అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డికి కూడా టిక్కెట్ అడుగుతున్నారు. దీంతో నంద్యాల టిక్కెట్ వ్యవహారం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో అఖిల ప్రియ త్వరలో అక్కడి టిక్కెట్ పై స్పష్టమైన ప్రకటన చేస్తారని... టిక్కెట్ తన సోదరికా... లేదంటే పెదనాన్న కుమారుడికా అన్నది తేల్చేస్తారని అంటున్నారు.
    
తన తల్లి, దివంగత ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి వర్థంతి సభ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా కుటుంబం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును మంత్రి అఖిలప్రియ స్వయంగా ప్రకటిస్తారని అనుచరులు అంటున్నారు.   శోభ వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, కార్యక్రమానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి అఖిలప్రియ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగానే ఆమె తమ ఇంటి నుంచి ఎవరు పోటీ పడతారో ప్రకటించి, వారికి మద్దతు ఇవ్వాలని కోరనున్నట్టు సమాచారం.
    
అయితే, చంద్రబాబు ఇంకా డిసైడ్ చేయకుండానే అఖిల ప్రియ ఇంతగా తానే నిర్ణయిస్తుండడంతో చివరకి ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. అఖిలకు మంత్రి పదవి ఇవ్వడంతో నంద్యాల టిక్కెట్ ఇతరులకు ఇస్తారా లేదంటే అఖిల కుటుంబసభ్యులకే ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News