పెళ్లికి ముందు.. తరువాత.. ఏదీ ప్రశాంతం?

Update: 2020-02-23 02:30 GMT
కరీంనగర్ కు చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. పెళ్లి కి ముందు వరకూ తెగ ఎంజాయ్ చేశారు.. ఉద్యోగాల్లో స్థిరపడ్డ వీరిద్దరూ మందు, విందులతో సుఖ వంతమైన జీవితం గడిపారు. 28వ ఏట వీరికి పెళ్లి అయ్యింది. దీంతో వారి జీవితం టర్న్ అయ్యింది.

మొదటి వ్యక్తి భార్య టీచర్ కావడంతో మన వాడు భార్య స్కూలుకు వెళ్లగానే ఫ్రెండ్స్ తో పార్టీలు, మందు, విందు కొనసాగించాడు. ఇక రెండో వ్యక్తి భార్య హౌస్ వైఫ్. మొగుడిని చంకలోనే పెట్టుకొని ఎటూ జారీపోనీయకుండా సంసారం సుఖం అందిస్తూ మందు, విందులకు దూరంగా భవసాగరంలో ఈదనిచ్చింది. కట్ చేస్తే మొదటి వ్యక్తికి 33 ఏళ్లకే షుగర్, బీపీ తదితర దీర్ఘకాల వ్యాధులు చుట్టు ముట్టాయి. వ్యసనాలు మానేసిన రెండో వ్యక్తి సుబ్బరంగా ఉన్నాడు.

దీన్నిబట్టి ఒంటరితనం.. జీవిత భాగస్వామి తోడు లేకపోతే పురుషులు చెడిపోతున్నారని లండన్ పరిశోధకులు చేసిన తాజా సర్వేలో వెల్లడైంది. పెళ్లికి ముందు, తరువాత పురుషులపై అధ్యయనం చేసి సంస్థ దాదాపు 10వేల మంది అభిప్రాయాలు సేకరించింది. భార్యతో సుఖమంతమైన జీవితం గడిపి ఆమె అదుపులో ఉన్న వారు ఆరోగ్యవంతులుగా ఉన్నారని.. పెళ్లయ్యాక వ్యసనాలు కొనసాగించిన వారు తీవ్ర జబ్బులు బారినపడ్డారని తేలింది. దాదాపు 10వేల మందిపై పరిశోధన చేసిన ఈ నిజాన్ని పరిశోధకులు కనుగొన్నారు.

పెళ్లికి ముందు అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే పెళ్లి తరువాత భార్య కంట్రోల్ లో కొంతమంది సెట్ రైట్ అయితారు. భార్యను గయ్యాలీగా ట్రీట్ చేస్తూ ఆడి పోసుకుంటున్నా.. ఆ కంట్రోల్ చేయడం వల్ల భర్తల ఆరోగ్యం మెరుగు పడిందని సర్వేలో తేలింది. పెళ్లికి ముందు కంటే తరువాత పురుషుడి జీవితంలో కాస్త సంతోషం తగ్గినా ఆరోగ్యం ఉండి ప్రశాంత జీవితం వస్తుందని పరిశోధకులు తేల్చారు.
Tags:    

Similar News