జంపింగ్స్ నూ పవన్ ప్రశ్నించాలంట

Update: 2016-04-25 10:19 GMT
చూస్తుంటే ఏపీలో చీమ చిటుక్కుమన్నా కూడా అది జనసేన అధినేత పవన్ కల్యాణ్ దే బాధ్యత అన్నట్లుగా మారింది. ఏపీలో ఏం జరిగినా.. పవన్ పై విమర్శలు చేయటం ఇప్పుడో అలవాటుగా మారింది. అదేమంటే.. ప్రశ్నిస్తామని చెప్పావ్.. ఇప్పుడేం చేస్తున్నావ్ అంటూ అవసరం ఉన్నా.. లేకున్నా విమర్శలు చేస్తున్న వారి వాదనలు కొన్ని విచిత్రంగా ఉండటం గమనార్హం.

తాజాగా ఆంధప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీ అధికారపక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ గురించి పవన్ ఎందుకు ప్రశ్నించటం లేదని ప్రశ్నించారు. శాసనసభా హక్కుల్ని కాలరాస్తూ.. ఎమ్మెల్యేల్ని కొనుగోలుకు తెర తీస్తే పవన్ ఎందుకు నోరు విప్పటం లేదని మండిపడ్డారు. సినిమా డైలాగులు చెబుతూ.. యువతలో తన మీదున్న అభిమానాన్ని అడ్డుగా పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నారన్న ఉదయ్ కుమార్ లాంటి వారి మాటల్ని చూస్తుంటే.. పవన్ పేరుతో మీడియాలో కనిపించాలన్న కాంక్షే ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రజాస్వామ్య హక్కుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న వారు? పవన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్న వారంతా గతంలో వైఎస్.. జగన్ లో ఆపరేషన్ ఆకర్ష్ లను ప్రయోగించినప్పుడు ఏం చేశారన్నది ప్రశ్న. అప్పుడు లేని బాధ అంతా ఇప్పుడే ఎందుకు వ్యక్తం చేస్తున్నారో..? పవన్ పేరు చెప్పి చెలరేగిపోతున్న ఇలాంటి వారి మాటలన్నీ రాజకీయ ప్రేరేపితాలన్న విమర్శ వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News