విద్యార్థులకు బెంగళూరే ఫస్ట్ ఛాయిస్

Update: 2020-09-02 23:30 GMT
ఐటీ సిటీ బెంగళూరు అందరినీ అక్కున చేర్చుకుంటోంది. ఆదరిస్తోంది. ఇప్పటికే టెక్ ఇంజినీర్ల స్వర్గధామంగా బెంగళూరు నగరం స్థిరపడిపోయింది. అలా బెంగళూరుకు ఇప్పుడు మరో ఘనత వచ్చింది.

దేశంలో ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న విద్యార్థుల్లో దాదాపు మూడో వంతు మంది బెంగళూరులోనే చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని క్యూఎస్ ఐగేజ్ సర్వేలో తేలింది.

దాదాపు 31శాతం మంది బెంగళూరుపై ఆసక్తి చూపిస్తుండగా.. ఆహ్లాదకర వాతావరణం, భద్రత, మౌళిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాల వల్ల యువత ఆ నగరం వైపు మొగ్గు చూపినట్లు సర్వే సంస్థ వెల్లడించింది.

ఇక బెంగళూరు తర్వాత ఐటీకి ఆలవాలమైన మన భాగ్యనగరం రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ లో చదివేందుకు 26శాతం మంది ఆసక్తి చూపించినట్లు సమాచారం.
Tags:    

Similar News