చంద్రబాబును కాపీ కొడుతున్న 'బండి సంజయ్'
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. ఇక్కడి ప్రజలు నాయకుల పనితీరును నిశితంగా గమనించి వారికి అధికారాన్ని కట్టబెడతారు. అయితే ఒక్కోసారి నాయకులు చేసే ప్రసంగాలకు ఓటర్లు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా ఒక పార్టీ మరో పార్టీపై చేసే ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అప్పటి వరకు ఒక పార్టీపై ఉన్న అభిమానాన్ని మరో పార్టీ వైపు తరలించేలా నాయకుల ప్రసంగాలు ఉంటాయి. దీనినే గొబెల్స్ ప్రచారం అంటారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబును గొబెల్స్ ప్రచారం చేస్తున్నాడని చాలా మంది అన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే ఫాలో అవుతున్నారని అంటున్నారు. అంటే గతంలో బాబు చేసిన పనినే ఇప్పుడు బండి సంజయ్ చేస్తున్నాడా..? అని చర్చించుకుంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చింది. రెండోసారి అలవోకగా విజయం సాధించిన టీఆర్ఎస్ కు ఆ తరువాత రెండేళ్ల నుంచి ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక నుంచి టీఆర్ఎస్ కు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ ఉప ఎన్నిక ద్వారా బీజేపీ పట్టు సాధిస్తు వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రభుత్వ పథకాలు మంచి ఫలితాలనిచ్చినా..డబుల్ బెడ్ రూం, ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడంతో ప్రజల్లో నిరాశ ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ పార్టీ వైపు ప్రజలు మరలడం ప్రారంభించారు.
ఇదే అదనుగా భావించిన బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎమోషనల్ వ్యాఖ్యలు చేస్తూ యూత్ ను ఆకర్షించగలిగారు. అప్పటికే నిరుద్యోగంతో సతమతమవుతున్న యువత బీజేపీ చేసే కామెంట్స్ టీఆర్ఎస్ పై వ్యతిరేకతను పెంచాయి. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక నుంచి ఏ ఎన్నిక జరిగినా బీజేపీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే హుజూరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం తెలంగాణకు ఫుల్ సపోర్టు ఉండడంతో పార్టీ ప్రతిష్ట రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.
ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసే వ్యాఖ్యలపై కూడా వ్యతిరేక ప్రభావం మొదలైంది. ఇప్పటి వరకు ఆయన కేసీఆర్ ను టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారు. భారీగా అవినీతికి పాల్పడిన కేసీఆర్ ను జైలుకు పంపుతామని అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం అని, టీఆర్ఎస్ కు 15 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ఆ పార్టీ నాయకులు తమ పార్టీ వైపు వచ్చేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు.
అయితే ఇప్పటి వరకు బీజేపీ కేవలం ఆరోపణలతోనే కాలం గడుపుతోందని కొందరు విమర్శిస్తున్నారు. నిజంగా కేసీఆర్ అవనితీనికి పాల్పడి ఉంటే ఈడీతో విచారించవచ్చుగా... అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ కు 15 సీట్లు మాత్రమే వస్తాయని ఏ లెక్కన చెబుతున్నారని అంటున్నారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పార్టీలోకి రావాలని చూస్తున్నారని అంటున్నారు.. కానీ ఇప్పటి వరకు వారిని తిట్టిపోసిన వారిని మళ్లీ బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారు..? అని అంటున్నారు.
కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చారు..? ఎన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేశారు..? లాంటి వాటిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా..? ఓ వైపు రేట్లు మండి పోతున్నాయి. పెట్రోల్ రేట్లు తెలంగాణలో అధికంగా ఉన్నాయని అంటున్నారు. అలాంటప్పుడు ఇక్కడ పెట్రోల్ రేట్లు తగ్గించి ప్రజలను ఆకర్షించొచ్చుగా.. నిత్యం కేసీఆర్ పై ఆరోపణలు చేయడమే తప్ప కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు తెలంగాణ ప్రజలకు ఎంతవరకు మేలు జరిగాయి..? ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది..? లాంటి విషయాలపై బండి సంజయ్ మాట్లాడరా..? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో బాబు సైతం అధికారంలో ఉన్న పార్టీపై ఆరోపణలతోనే కాలం గడిపారు. అందుకే ఆయనకు మరోసారి అధికారం అవకాశం దక్కలేదు. కేవలం గోబెల్స్ ప్రచారంతోనే అధికారంలోకి రావాలనుకోవడం ఒకప్పటి సాధ్యం కావచ్చు.. కానీ నేటి కాలంలో ప్రతీ విషయంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..? అని చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ చంద్రబాబును బండి సంజయ్ ఫాలో అవడం అవివేకమే అవుతుందని అనుకుంటున్నారు.