ఆ రెండు చోట్ల అధికారుల తీరుపై ఎస్ఈసీకి బాబు కంప్లైంట్
ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు రాజకీయ అలజడిని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఏపీ సర్కారుకు నడుస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా అధికారులు పెద్ద ఎత్తున అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తాజాగా.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ అంశంపై ఆయన కంప్లైంట్ చేశారు.
మాచర్ల.. పుంగనూరులో పోలీసులు.. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలోనూ ఈ రెండు నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఇప్పుడూ ఏకగ్రీవాల కోసం ఆరాచకాలకు పాల్పడుతున్నట్లుగా బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు సైతం స్పందించటం లేదన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు.. నోడ్యూస్ సర్టిఫికేట్లు ఇవ్వటం లేదని.. ఈ అంశంపై తక్షణమే స్పందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కోరుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజే గడువు ఉండటంతో.. తాము చేసిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. అధికారులు సహకరించేలా చూడాలని ఆయన కోరుతున్నారు. శాంతియుతంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యేలా చూడాలని చంద్రబాబు కోరుతున్నారు. మరి.. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది చూడాలి.