బాహుబలితో రాజధానికి 'బెనిఫిట్‌' రూ.50 లక్షలు!!

Update: 2015-07-09 11:35 GMT
బాహుబలి సినిమాతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కూడా లబ్ధి చేకూరనుంది. దాదాపు రూ.50 లక్షల వరకూ లాభం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం.. ఈ సినిమా బెనిఫిట్‌ షో ద్వారా వచ్చే డబ్బులను రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించడమే!

కృష్ణా జిల్లాకు సంబంధించి బాహుబలి సినిమా రైట్స్‌ తీసుకున్న ప్రముఖ నిర్మాత, సమర్పకుడు సాయి కొర్రపాటి ఒకరోజు ముందుగానే బాహుబలిని విజయవాడలో ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా శుక్రవారం విడుదల కానుండగా.. కృష్ణా జిల్లాలోని 30 థియేటర్లలో ఆయన గురువారం అర్ధరాత్రే బెనిఫిట్‌ షో వేయనున్నారు. వీటిలో అత్యధికం విజయవాడలోనే ఉన్నాయి. దీని ద్వారా వచ్చిన డబ్బులను ఆయన నవ్యాంధ్ర నిర్మాణానికి ఇస్తానని ప్రకటించారు.

వాస్తవానికి, విజయవాడలో 30 థియేటర్లలో బెనిఫిట్‌ షో వేస్తున్నా.. ఈ టికెట్లను బయట ఎవరికీ విక్రయించలేదు. ఒక్కో థియేటర్‌లో ఒక్కో షోను దాదాపు 2-3 లక్షలకు కొనుగోలు చేశారు. చాలామంది థియేటర్‌ యజమానులు దానిని తమ కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రత్యేకించనున్నారు. మరికొన్నిచోట్ల లయన్స్‌ క్లబ్‌ వంటి వివిధ సంఘాలు కొనుక్కున్నాయి. దాంతో ఖర్చులు పోను దాదాపు రూ.50 లక్షల వరకూ ఆదాయం వచ్చే ఆదాయం ఉందని, దానిని నవ్యాంధ్ర రాజధానికి విరాళంగా ఇవ్వాలని సాయి కొర్రపాటి నిర్ణయించారు.

Tags:    

Similar News