అజహర్ వెర్సస్ ఆఫీస్ బేరర్స్.. హెచ్సీఏలో ముసలం

Update: 2020-09-06 08:30 GMT
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అర్ధంతరంగా కెరీర్ ముగించాక మాజీ క్రికెటర్ అజహరుద్దీన్.. ఆ తర్వాత కొంత కాలం రాజకీయాల్లో ఉండి.. ఆపై క్రికెట్ రాజకీయాల్లోకి వచ్చి గత ఏడాది అనూహ్యంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. కానీ ఆ పదవిలో కూర్చున్నప్పటి నుంచి అజహర్‌ ఎప్పుడూ ప్రశాంతంగా పని చేసుకున్నది లేదు. తన వర్గం నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటూ తరచుగా వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఆయన నిర్ణయాలు మళ్లీ మళ్లీ వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా మరోసారి అజహర్‌కు, మిగతా ఆఫీస్ బేరర్లకు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాజా హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ అంబుడ్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌, ఎథిక్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్ దీపక్ వర్మను నియమిస్తూ అజహర్ తీసుకున్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా.. వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) పెట్టకుండా, అందులో ఆమోదించకుండా అజహర్ ఏకపక్షంగా ఈ నియామకం చేపట్టడాన్ని వాళ్లు తప్పుబడుతున్నారు. ఈ మేరకు హెచ్సీఏ కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కోశాధికారి సురేందర్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శి నరేశ్‌‌‌‌‌‌‌‌ శర్మ అజహర్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. దీపక్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకే లేఖ రాశారు. అలాగే బీసీసీఐకి కూడా ఈ కాపీని పంపారు. ఇదిలా ఉంటే అబుండ్స్‌మన్ నియామకంపై రచ్చ జరగడానికి ముందు అజహర్ చేసిన మరో పని ఆఫీస్ బేరర్లకు ఆగ్రహం తెప్పించింది. ఇటీవల అజహర్ తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌‌‌‌‌‌‌, ఐటీ మంత్రి కేటీఆర్‌‌ల‌‌‌‌‌‌‌తో భేటీ అయ్యాడు. ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియం లీజు గడువును పెంచాలని, ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని కోరాడు. ఆ సందర్భంగా యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్)తో కలిసి పని చేసేందుకు హెచ్సీఏ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. ఐతే ఈ భేటీకి హెచ్సీఏ ఆఫీస్ బేరర్లెవరినీ తీసుకెళ్లని అజహర్.. తన వెంట కొడుకు పట్టుకెళ్లడం పై నలుగురికి ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు అంబుడ్స్‌మన్ నియామకం ఏకపక్షంగా చేపట్టడంతో వారి ఆగ్రహం డబులై తిరుగుబావుటా ఎగురవేశారు.
Tags:    

Similar News