అయేషా రీపోస్టుమార్టం.. ఏం చేశారంటే?

Update: 2019-12-15 07:44 GMT
అయేషా మీరా.. విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్టళ్లలో దారుణ అత్యాచారం, హత్యకు గురైన ఈ ఫార్మసీ విద్యార్థిని మరణానికి కారకులను ఇప్పటికీ తెలుసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన ఈ విజయవాడ విద్యార్థిని 2007లో హత్యకు గురైంది.12 ఏళ్ల క్రితం జరిగిన ఈ అన్యాయంపై ఎవరు చేశారో ఇప్పటికీ ఎవరూ తేల్చలేని పరిస్థితి.

హైకోర్టులో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దీంతో శనివారం సీబీఐ అధికారులు అయేషా మీరా  డెడ్ బాడీకి రీపోస్టుమార్టం నిర్వహించారు. తెనాలిలోని చెంచుపేట ముస్లిం శ్మశానవాటికలో ఉదయం సీబీఐ అధికారులు ఆమె అవయవాలను సేకరించారు.

ఢిల్లీ, హైదరాబాద్ , విశాఖ నుంచి వచ్చిన దాదాపు 20 మంది అధికారులు, వైద్యులు, నిపుణులు ఈ పంచనామాలో పాల్గొన్నారు.శనివారం ఉదదయం మత పెద్దల సమక్షంలో అయేషా మీరాను ఖననం చేసిన ప్రాంతాన్ని గుర్తించి, సమాధి చుట్టూ మార్కింగ్ ఇచ్చి సమాధిని తవ్వి, లోపలి ఎముకలను సేకరించి అస్తిపంజరం రూపంలో అమర్చారు. కొన్ని అవశేషాలను సేకరించి మిగిలిన అవయవాలను తిరిగి పూడ్చివేశారు.

అయేషా మీరా హత్య జరిగి 12 ఏళ్లు అవుతోంది. దీంతో ఆమె పుర్రె, ఎముకలు మాత్రమే లభించాయి. వీటి ఆధారంగానే అయేషాకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయో పరిశీలించారు. అయేషా తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయిందని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ అధికారులు ఫోరెన్సిక్ ద్వారా నిగ్గుతేల్చేందుకు రెడీ అయ్యారు.

అయేషాను చంపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యనేత మనవడు అని ఆరోపణలు వచ్చాయి. అయితే రాజకీయ అండదండలతో ఈ కేసులో ఓ చిల్లర దొంగను బూచీగా చూపి జైలు పంపారన్న విమర్శలున్నాయి.. హైకోర్టు చివరకు ఆ చిల్లరదొంగ నిర్దోషి అని తీర్పునిచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
Tags:    

Similar News