టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడి వీసా రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం
ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచ టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ తమ దేశంలో జరిగే టోర్నీలో ఆడేందుకు వచ్చిన సందర్భంగా.. అతడి వీసాను రద్దు చేసి షాకిచ్చింది. ఇంతకూ అలాంటి సంచలన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్లు? వీసా రద్దు చేసేంత పెద్ద తప్పు జకోవిచ్ ఏం చేశాడు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. ఆశ్చర్యపోవాల్సిందే. ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడేందుకు వచ్చిన అతడికి షాకింగ్ అనుభవం ఎదురైంది.
ఇంతకూ ఆ టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడి వీసా రద్దు చేయటానికి కారణం.. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ఆధారాల్ని సమర్పించకపోవటమే. వ్యాక్సినేషన్ కు సంబంధించిన తగిన ఆధారాల్ని కల్పించని కారణంగా జకోవిచ్ ను ఎయిర్ పోర్టులోనే నిలిపివేసినట్లుగా ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. వీసా రద్దు చేయటం కారణంగా మెల్ బోర్న్ విమానాశ్రయంలో జకోవిచ్ ఎనిమిది గంటల పాటు ఉండిపోవాల్సి వచ్చింది.
ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారుడి విషయంలో ఇలా వ్యవహరిస్తారా? అంటూ సెర్బియా దేశాధ్యక్షుడు అలెక్సాండర్ వ్యూకిక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జకోవిచ్ తో తాను మాట్లాడానని.. సెర్బియా దేశం మొత్తం అతని వెంట ఉందని చెప్పినట్లు వెల్లడించారు. ఒక ప్రముఖ ఆటగాడికి సంబంధించిన వ్యాక్సినేషన్ లేకుండా తమ దేశంలో అడుగు పెట్టటాన్ని ఆస్ట్రేలియా అధికారులు ఎంత కచ్ఛితంగా వ్యవహరిస్తారన్న విషయం ప్రపంచానికి అర్థం కాగా.. ఈ ఇష్యూ మరో దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ స్పందించారు.
తమ దేశ సరిహద్దుల్లోకి ఎవరు వచ్చినా వారు కచ్ఛితమైన నిబంధనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ వ్యక్తికైనా ఒకేలాంటి నిబంధనలు ఉంటాయని తేల్చారు. ఆస్ట్రేలియాలోకి ప్రవేశించటానికి అవసరమైన సాక్ష్యాల్ని అందించటంలో విఫలమైనట్లుగా పేర్కొన్నారు. కరోనా వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండటానికి వైద్య పరంగా మినహాయింపు ఉందన్న పత్రాల్ని చూపించకుంటే.. దేశంలోని రానివ్వమని తేల్చేశారు.
ఇప్పటికే తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న జకోవిచ్ కు తాజా పరిణామం చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మెల్ బోర్న్ చేరుకున్న అతని పత్రాల్లో వ్యాక్సినేషన్ కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో అతన్ని ఎయిర్ పోర్టులోనే ఆపేయటమే కాదు.. వీసా రద్దు చేశారు. తన కుమారుడి విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జకోవిచ్ తండ్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.