• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అచ్చెన్నకు బాలయ్య...

అచ్చెన్నకు బాలయ్య ఆవహించాడా?

By - Tupaki Desk
Update: 2017-10-25 13:24 GMT
చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అచ్చెన్నాయుడు అంటే.. సాధారణంగా మీడియాకు హడల్. ఎందుకంటే.. ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే.. ఖంగుమని హైపిచ్ లో మోగే ఆయన కంఠస్వరం మైకు అవసరం లేకుండానే.. విలేకరుల చెవుల తుప్పు వదలగొట్టేలా ఉంటుంది. అలాంటిది... ఆ ప్రెస్ మీట్ కాస్తా రాజకీయ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడానికి పూనుకున్నాడంటే మాత్రం.. ఇక దబిడి దిబిడే. దబిడి దిబిడే అంటే గుర్తొచ్చింది. తాజాగా అచ్చెన్నాయుడు కు నందమూరి బాలకృష్ణ ఆవహించినట్లున్నారు. బాలయ్య ఫాక్షన్ సినిమాల్లో బెదిరించిన రేంజిలో.. ఆయన వైసీపీకి హెచ్చరికలు ఇచ్చేస్తున్నారు మరి!

‘నీ ఊరికొస్తా.. నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా...’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు తెలుగునాట ఎంత ఫేమసో అందరికీ తెలుసు. ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా అదే డైలాగుల ఇమిటేషన్ లో మాట్లాడుతున్నాడు. కావాలంటే వైసీపీ ఆఫీసుకే వస్తా.. అంటూ సవాళ్లు విసురుతున్నాడు. కలబడడానికి కాదు గానీ.. తమ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం చేపడుతున్న పనుల గురించి చర్చ పెట్టడానికట.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతుండే సరికి చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులంతా ఒక్కొక్కరుగా యాక్టివేట్ అవుతున్నారు. జగన్ నుంచి ముందు ముందు ప్రతిరోజూ విమర్శల వెల్లువ తప్పదు గనుక.. ముందునుంచే వీరు జగన్ మీద వాగ్బాణాలు సంధించడంలో బిజీగా గడుపుతున్నారు. జగన్ కు పాదయాత్ర చేసే అర్హతే లేదని ఒకరు అంటోంటే.. ఆయన చేసినా తమకే లాభం అని మరొకరు అంటున్నారు. ఇలా వారి మాటల పర్వం సాగుతోంది. అయితే అచ్చెన్నాయుడు వ్యవహారం కొంత వెరైటీ గా ఉంది.

తమ ప్రభుత్వం బీసీల కోసం చాలా చేస్తున్నదట. ఆ విషయంలో వైసీపీ ఆఫీసుకు వచ్చి కావలిస్తే ఆయన చర్చ కు కూర్చుంటారట. తము చేస్తున్న పథకాల గురించి చెబుతారట. అయినా అంతగా సవాలు విసరదలచుకుంటే.. అందరూ పాదయాత్రకు వెళుతున్న వేళ ఆయన వైసీపీ ఆఫీసుకు వెళ్లడం కాదు.. జగన్ పాదయాత్ర ప్రదేశానికే వెళ్లి.. ఎక్కడైతే జగన్ విమర్శలు చేస్తాడో.. అక్కడికక్కడే ప్రతి విమర్శకూ సమాధానం చెప్పే ప్రయత్నం చేయవచ్చు కదా..! అని జనం అనుకుంటున్నారు.

Tags:    
  • Atchennaidu 
  • YS Jagan 
  • Telugu NEWs 

Similar News

రాజమండ్రికి 'మహా కుంభమేళా' వైభవం.. గోదావరి పుష్కరాల ప్రత్యేకతలు ఇవే..!

2026-11-25 13:13 GMT

అమెరికా కల ఎంత గొప్పదైనా.. చిన్నారుల ప్రాణాల కంటే గొప్పది కాదు...

2026-11-25 13:13 GMT

పాకిస్తానీ న‌టీన‌టుల‌ను వెంటాడుతున్న ఆప‌రేష‌న్ బొమ్మాళీ

2026-11-25 12:54 GMT

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

2026-11-25 12:51 GMT

ఇంటింటికీ వచ్చి క్షమాపణ చెబుతా: గౌతు శిరీష సంచలన వీడియో

2026-11-25 12:50 GMT

అక్కడి నుంచే పోటీ.. ఆ నియోజకవర్గమే ఎందుకు? కవిత నిర్ణయం వెనుక అసలు కథేంటి?

2026-11-25 12:42 GMT

ఒకే క్లిక్‌తో 10 లక్షల మందికి సందేశం.. టీడీపీని నడిపిస్తున్న డిజిటల్ వెన్నెముక

2026-11-25 12:05 GMT

జ‌న‌సేన 'క‌ట్టు' త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?

2026-11-25 12:04 GMT

టీడీపీలో సామాన్య కార్యకర్తలకు పదవులు.. అసలు సీక్రెట్ ఇదే.. పనిచేసిన లోకేశ్ మాస్టర్ ప్లాన్!

2026-11-25 11:01 GMT

10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!

2026-11-25 10:31 GMT

పింకీ సార్ పింకీ అంతే.. దీని ముందు బాహుబలి బర్రెలన్నీ పక్కకు బలాదూర్

2026-11-25 10:11 GMT

అమెరికాలో పదేళ్లు ఉంటే గ్రీన్‌కార్డా? లక్షలాది వలసదారులకు ఊరటనిచ్చేలా డెమోక్రాట్ల కొత్త బిల్లు

2026-11-25 10:10 GMT

Copyright @2026

Powered by Blink CMS