బస్సుని ఢీ కొట్టిన రైలు .. 20 మంది దుర్మరణం ...
పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ , రైల్వే క్రాసింగ్ వద్ద చూసుకోకుండా ట్రాక్ దాటేయాలని ప్రయత్నం చేయడంతో వేగంగా అటువైపు నుండి వచ్చిన రైలు , బస్సుని ఢీ కొట్టి, సుమారుగా 200 మీటర్ల వరకు అలాగే తోసుకుంటూ వెళ్ళింది. రైల్వే క్రాసింగ్ వద్ద కాపలాదారుడు లేక పోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం సంభవించింది అని తెలుస్తుంది. ఈ సంఘటన పాకిస్థాన్ సింధ్ ప్రాంతంలోని సుక్కూరు జిల్లా రోహ్రీ ప్రాంతంలో జరిగింది.
ఈ ప్రమాదంలో 20 మంది మృతిచెందగా, మరో 55 మంది గాయపడినట్టు ఆయన తెలియజేశారు. క్షతగాత్రులను సుక్కూరు, రోహ్రీలోని హాస్పిటల్ కు తరలించారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కరాచీ నుంచి సర్గోదా వెళ్తున్న బస్సు కాపలా లేని కంధ్రా రైల్వే క్రాసింగ్ ను దాటే ప్రయత్నం చేసింది. అదే సమయంలో రావల్పిండి నుంచి కరాచీ వెళ్తున్న 45 అప్ పాకిస్థాన్ ఎక్స్‌ప్రెస్ రైలు.. బస్సును ఢీకొట్టింది.
ఇకపోతే , ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జు అయినట్టు చెప్పారు. బస్సును రైలు దాదాపు 200 అడుగుల వరకు ఈడ్చుకెళ్లినట్టు సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ తెలిపారు. ఈ రైల్వే క్రాసింగ్ వద్ద ఎవరూ కాపాలా లేరని, రైలు ఢీకొట్టి వేగానికి బస్సు రెండు ముక్కలైందని , మృతులు, క్షతగాత్రులు బస్సులోని ప్రయాణికులేనని, లోకోపైలట్ స్వల్పంగా గాయపడినట్టు ఆయన వివరించారు. ప్రమాదం కారణంగా పంజాబ్-సింధ్ మార్గంలో తాత్కాలికంగా రైళ్లను నిలిపివేశారు. కాగా, ఈ ఘోర ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే మంత్రి షైక్ రషీద్ అన్నారు. రైలు ప్రయాణికులు అందరూ సురక్షితం గా ఉన్నట్టు తెలిపారు.