మోడీకి మరోషాక్.. సీఏఏకు రాజస్థాన్ చెక్

Update: 2020-01-25 10:34 GMT
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశంలో వ్యతిరేకత తగ్గడం లేదు. ఇప్పటికే అందరూ రోడ్డెక్కి నిరసన తెలుపగా.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలు తమ రాష్ట్రంలో అమలు చేయమని స్పష్టం చేశాయి. ఈ మేరకు సీఎంలు ప్రకటించారు.

తాజాగా సీఏఏను వ్యతిరేకిస్తున్న మరో రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. శనివారం రాజస్థాన్ అసెంబ్లీ లో సీఏఏ పై వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ అధికారం లో ఉండడం.. ఫుల్ మెజార్టీ చేతి లో ఉండడం తో ఈజీగా సీఏఏ అమలు చేయమనే తీర్మానాన్ని నెగ్గించుకుంది.

ఇక రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు సభ పోడియం వద్ద కు దూసుకెళ్లారు. రచ్చ చేశారు. అయినా సీఎం అశోక్ గెహ్లాట్ తీర్మానాన్ని పాస్ చేయించారు. అంతకు ముందే కేబినెట్ లో సీఏఏ వ్యతిరేక ప్రతిపాదన సర్క్యూలర్ ను ఆమోదించారు.

ఇక రాజస్థాన్ లో సీఏఏను అమలు చేయబోమని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఒత్తిడి తెచ్చినా అమలు చేయమని స్పష్టం చేశారు.
Tags:    

Similar News