జగన్ కు మిత్రుడి షాక్!.. ఏపీలోకి ఎంఐఎం ఎంట్రీ..

Update: 2021-03-05 04:22 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ తనకు మిత్రుడు అని..అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోటీ పెట్టినా ఏపీలో పెట్టలేదని అప్పట్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అప్పట్లో ప్రకటించారు. అందుకే గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఏపీలో పోటీచేయలేదు.

అయితే ఇప్పుడు రోజులు మారాయి. బీహార్, బెంగాల్ , తమిళనాడు సహా దేశమంతటా విస్తరించిన హైదరాబాద్ పాతబస్తీ పార్టీ ఇప్పుడు పక్కనే ఉన్న ఏపీలోనూ అడుగు పెట్టి జగన్ కు షాకిచ్చింది.  

ఎంఐఎం ఒకప్పుడు పూర్తిగా తెలంగాణకు పరిమితమైన పార్టీ. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన పార్టీగానే ఉంది.కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో సీట్లు సాధించే స్థాయికి ఎదిగింది.మైనార్టీ ఓట్లు లక్ష్యంగా.. ఆ ప్రాంతాలే పట్టుగా ఎంఐఎం పోటీచేసి గెలుస్తోంది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎంఐఎం పార్టీ సత్తా చాటుతోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపీ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తమ వర్గం ఓట్లను చీల్చి ప్రధాన పార్టీల ఓటమికి ఎంఐఎం కారణమవుతోంది.

ఈ క్రమంలోనే ఏపీలోనూ ఎంఐఎం అడుగుపెట్టింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్లలో ఎంఐఎం పోటీచేయాలని నిర్ణయించింది.ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుసేన్ ప్రచారం చేశారు. 64 స్థానాల్లోని 2 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీచేస్తుండడంతో ఇక ఏపీలోనూ ఎంఐఎం అడుగుపెట్టినట్టైంది.
Tags:    

Similar News