వాట్సాప్‌ కు దీటు ఆర్మీ ఎస్ఏఐ యాప్ !

Update: 2020-10-31 02:30 GMT
వాట్సాప్‌ కు దీటుగా ఇండియ‌న్ ఆర్మీ ఓ స‌రికొత్త యాప్‌ ను రూపొందించింది. ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ ‌లో భాగంగా ఈ యాప్ ‌ను ఇండియ‌న్ ఆర్మీ అభివృద్ధి చేసింది. సెక్యూర్ అప్లికేష‌న్ ఫ‌ర్ ది ఇంట‌ర్నెట్ (ఎస్ ఏ ఐ) పేరిట ఈ యాప్‌ ను భార‌త ఆర్మీ తీసుకువచ్చింది. అయితే, ఇది కేవ‌లం ఆర్మీలో ఉన్న‌వారికే అందుబాటు లో ఉండ‌నుంది. ఈ యాప్ లో వాయిస్, టెక్ట్స్ మెసేజ్ లు పంపుకోవ‌చ్చు. వీడియో కాలింగ్ స‌దుపాయం కూడా ఉంది. పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్‌ క్రిప్ష‌న్ ను ఈ యాప్ క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల ఆయా మెసేజ్ ల‌ను యాక్సెస్ చేయ‌డం ఇత‌రుల‌కు సాధ్య పడదు. ఇక ఆర్మీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎస్ఏఐ యాప్ ‌ను ఉప‌యోగించుకోనున్నారు.

ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ ఫాంపై ఈ యాప్‌ ను విడుద‌ల చేయ‌గా, త్వ‌ర‌లోనే ఐఓఎస్ ప్లాట్ ఫాంపై ఈ యాప్ ల‌భ్యం కానుంది. అందుకు సంబంధించిన డెవ‌ల‌ప్ ‌మెంట్ ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. ఈ మేర‌కు భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తాజాగా ఈ యాప్‌కు చెందిన వివ‌రాల‌ను వెల్ల‌డించింది. వాట్సాప్‌ కు బ‌దులుగా ఎస్ ఏ ఐ యాప్‌ ను భార‌త ఆర్మీ ఉప‌యోగించుకునేందుకు వీలుగా ఈ యాప్‌ ను డెవ‌ల‌ప్ చేశారు. ఇందులో పూర్తిగా సుర‌క్షితంగా మెసేజ్‌ల‌ను ఆర్మీ వారు పంపుకోవ‌చ్చు. ఈ యాప్ వాట్సాప్‌, టెలిగ్రాం త‌దిత‌ర ఇన్‌ స్టంట్ మెసేజింగ్ యాప్‌ ల మాదిరిగా ప‌నిచేస్తుంద‌ని ఆర్మీలోని ఒక అధికారి వెల్ల‌డించారు. పాకిస్థాన్ ఐ ఎస్ ఐ తరచుగా వాట్సాప్ , సోషల్ మీడియా ద్వారా హాని ట్రాప్ తో భారత ఆర్మీ సున్నిత సమాచారాన్ని సేకరిస్తుండటంతో వాట్సప్ .. వాడొద్దని ఇప్పటికే ఆర్మీ సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు.
Tags:    

Similar News