• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దేనికైనా సిద్ధం అంటున్న...

దేనికైనా సిద్ధం అంటున్న ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ !

By - Tupaki Desk
Update: 2020-01-01 10:10 GMT
దేశ నూతన సైన్యాధ్యక్షునిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరావణే మంగళవారం ఉదయం బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కార్యాలయంలో ఆయన బాధ్యతలను చేపట్టారు. ఇక నేడు (బుధవారం) ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సైనిక వందనం స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా దేశంలో ఉత్తరాదిన, ఈశాన్య ప్రాంతాల్లో సైన్యం సామర్థ్యత ను మరింత పెంచుతామని ఆయన తెలిపారు.

అలాగే అన్ని వేలలా సంసిధ్ధంగా ఉండాలన్నదే సైన్యం ధ్యేయమని, ఇది తమ ప్రాధాన్యత అని అయన తెలిపారు. ముఖ్యంగా మానవ హక్కులను గౌరవించడం పట్ల ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటామని ఆయన అన్నారు. భారత సైన్యంలో 28 వ ప్రధాన అధికారి అయిన మనోజ్ ముకుంద్.. ముందు కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. దీర్ఘ కాలం పెండింగులో ఉన్న సంస్కరణల అమలు, కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం అదుపు, టిబెట్ ప్రాంతంలో చైనా సైనిక జాడలపై నిఘా వంటివి ఇందులో ముఖ్యమైనవి. 37 ఏళ్ళ తన సర్వీసులో ఆయన, అనేక కమాండ్, స్టాఫ్ అపాయింట్ మెంట్లకు సంబంధించిన అధికారి హోదాల్లో పని చేశారు. జమ్మూ కాశ్మీర్లో కౌంటర్ ఇన్ సర్జెన్సీ కార్యకలాపాలకు నేతృత్వం వహించారు.

ఇక పొతే కొత్తగా ఆర్మీ చీఫ్ జనరల్ గా భాద్యతలు స్వీకరించిన మనోజ్ ముకుంద్ కి దేశ సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో సిద్ధహస్తుడిగా పేరు ఉంది. ఇదివరకు చైనా, మయన్మార్ దేశాలతో తలెత్తిన సరిహద్దు వివాదాల్లో ఆయన చురుకుగా వ్యవహరించారు. చైనాతో సిక్కిం సరిహద్దు ల్లోని డోక్లాం కూడలి వివాద సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్  లోని లడక్ వద్ద చైనా తో తలెత్తిన అక్సాయ్ చిన్ వివాదానికి అడ్డుకట్ట వేయడం లో మనోజ్ ముకుంద్ తనదైన శైలిలో పావులు కదిపారు.


Tags:    
  • Army prepared for border challenges 
  • India needs to pay more attention to China border 
  • Manoj Mukund 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Andhra News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సోనియా పుస్త‌కంలో తెగవెతికేసిన అంశాలు ఇవే!

2026-11-10 14:30 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించ‌ని ఘ‌ట్టం!

2026-11-10 13:12 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

పవన్ విడాకుల వేళ.. రేణు హుందాతనం

2026-11-10 11:45 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

రాప్తాడు బాలిక ఆరోగ్యంలో కీలక మార్పు.. ప్రాణాపాయం దాటినట్లే!

2026-11-10 09:39 GMT

ఒక ఎఫైర్ ఖరీదు అక్షరాల రూ.18 లక్షల కోట్ల నష్టం..

2026-11-10 09:37 GMT

10 రోజుల ఉత్కంఠ.. 19న జడ్పీ, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక

2026-11-10 09:36 GMT

పవన్ కోసం.. టీడీపీ, వైసీపీ ఒకే మాట!

2026-11-10 09:36 GMT

Copyright @2026

Powered by Blink CMS