ప్రాక్టీస్ మ్యాచ్ లో సొంత జట్టును భయపెట్టిన అర్జున్ టెండూల్కర్

Update: 2021-02-08 07:10 GMT
క్రికెట్ దేవుడుగా అభివర్ణించే సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు ఉండే సమస్యలు అన్ని ఇన్ని కావు. తండ్రి ఒక భారీ బ్యాగేజ్ తో అతన్ని నీడలా వెంటాడుతుంటాడు. దాన్ని అధిగమించటం అంత తేలికైన విషయం కాదు. ఇటీవల ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకోవటం ద్వారా వార్తల్లోకి వచ్చారు. రూ.20లక్షల కనీస ధరకు ఆయన పేరు నమోదైంది. ఆయన్ను ఏ జట్టు సొంతం చేసుకుంటుందన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ హజారే ట్రోఫిలో ఆడే అవకాశం లభించింది. అయితే.. ప్రాక్టీస్ మ్యాచ్ లో అర్జున్ ఆటతీరు తీవ్రంగా నిరాశ పర్చటమే కాదు.. ఆ మ్యాచ్ లో  ఇచ్చిన పరుగులు.. అతనికి జట్టులో ఆడే అవకాశాన్ని మిస్ అయ్యేలా చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మూడు జట్ల ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో టీమ్ ఏ సభ్యుడిగా ఉన్న అర్జున్ ఒక మ్యాచ్ ఆడాడు.

బౌలర్ కమ్ ఆల్ రౌండర్ అయిన అర్జున సదరు మ్యాచ్ లో 4.1 ఓవర్లు బౌల్ చేశారు. ఈ సందర్భంగా 12.93 ఏకానమీ రేట్ తో ప్రత్యర్థి జట్టుకు 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ తీయలేకపోయారు. దీంతో విజయ్ హజారే ట్రోఫీకి అతని ఎంపిక అనుమానంగా మారింది. ఐపీఎల్ వేలం ఈ నెల 18న జరగనుంది. దానికి ముందుగా జరిగిన ఈ మ్యాచ్ లో అర్జున్ ప్రతిభ.. అతని కొనుగోలు మీద ప్రభావాన్ని చూపుతుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ప్రతి అడుగులోనూ తన తండ్రితో పోల్చే అలవాటు.. అతనిపై ఒత్తిడిని మరింతగా పెంచుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News