భారత్ లో టీకా వినియోగడానికి ‘ఫైజర్’ దరఖాస్తు

Update: 2020-12-07 06:25 GMT
ఇప్పటికే విజయవంతమై మూడో ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంటున్న అమెరికా ఫార్మా దిగ్గజం ‘ఫైజర్’ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమైంది. ఈ వ్యాక్సిన్ ను భారత్ లో వినియోగదానికి అత్యవసర అనుమతులను మంజూరు చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ని కోరింది.

ఇప్పటికే యూకే, బహ్రెయిన్ లో ఈ ఫైజర్ వ్యాక్సిన్ అనుమతులు పొందింది. అక్కడ అమ్మకాలను మొదలుపెట్టింది.

మన దేశంలో కరోనా టీకా వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న మొదటి సంస్థ ఇదే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా వినియోగానికి దరఖాస్తు అందిందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి.

ఇక ఆక్స్ ఫర్డ్ టీకా ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని సీరం ఇన్ స్టిట్యూట్ కూడా ఆదివారం కేంద్రాన్ని కోరింది.

నిబంధనల ప్రకారం అనుమతి కోరిన 90 రోజుల్లో బదులు ఇవ్వాలి. యూకే, బహ్రెయిన్ లో ఫైజర్ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తే డీసీజీఐ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫైజర్ వ్యాక్సిన్ 95శాతం సక్సెస్ రేటు సాధించింది. అయితే దీన్ని మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లో భద్రపరచాలి. అంత ఉష్ణోగ్రత దేశంలో సాధ్యం కాదు. అందుకే ఈ ఫైజర్ టీకాతో భారత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు. అమెరికా, జర్మనీలు కూడా ఈ వ్యాక్సిన్ కు ఇంకా అనుమతులు ఇవ్వలేదు.
Tags:    

Similar News