విశాఖ గర్జన తర్వాత వైసీపీ గర్జన నిర్వహించేది ఇక్కడే!
ఏపీలో అన్ని పార్టీలు ఒకే ఒక్క రాజధాని అమరావతికి అనుకూలంగా ఉండగా.. ఒక్క అధికార పార్టీ వైసీపీ మాత్రమే మూడు రాజధానుల జపం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో హైకోర్టులో మొట్టికాయలు తిన్నా జగన్ ప్రభుత్వం దూకుడుగానే ముందుకెళ్తోంది. ఇప్పటికే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నవంబర్ 1 నుంచి సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందే మూడు రాజధానుల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, ర్యాలీలు, గర్జనలు నిర్వహించడానికి వైసీపీ పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో భారీ గర్జన, ర్యాలీ నిర్వహించింది. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, విజయవాడల్లోనూ మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీలు మేధావుల పేరిట సదస్సులు నిర్వహించాయి. అయితే వీటి వెనుక కర్మ, కర్త, క్రియ.. అన్నీ వైసీపీ అనేది బహిరంగ రహస్యమే.
ఈ క్రమంలో ఇక ఇప్పుడు వైసీపీ రాయలసీమపై దృష్టి సారించింది. తిరుపతిలో భారీ గర్జన, ర్యాలీకి ఏర్పాట్లు చేసుకుంటోంది. తద్వారా మూడు రాజధానులకు రాయలసీమలోనూ మద్దతు సాధించాలని వైసీపీ యోచిస్తోంది.
ఈ క్రమంలో అక్టోబర్ 29న మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించనుంది. ఈ సభతో రాయలసీమలో మూడు రాజధానుల శంఖారావం పూరించడానికి వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విశాఖలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో తిరుపతి సభనూ అదే స్దాయిలో విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
తిరుపతి గర్జనకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మంత్రులను తీసుకొచ్చి తమ సత్తా చాటాలని భావిస్తోంది. తిరుపతి సభ తర్వాత నవంబర్ మొదటి వారం నుంచి రాయలసీమలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించనుంది.
మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించనుంది. అయితే కేవలం వైసీపీ మాత్రమే ఈ సభలు, ర్యాలీలు, గర్జనలు చేస్తున్నట్టుగా కాకుండా నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో విద్యార్థులను, మేధావులను, ఫ్రొపెసర్లను, ఉద్యోగులను ఇందులో మిళితం చేయనుంది. జేఏసీని ఏర్పాటు చేసి మూడు రాజధానుల వ్యవహారంలో ముందుకెళ్లాలని వైసీపీ ప్రణాళికలు రచించుకుంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.