బ్రేకింగ్: నిమ్మగడ్డకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

Update: 2020-05-31 05:14 GMT
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను నియమించేందుకు ఏపీలోని జగన్ ప్రభుత్వం ససేమిరా అంది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. దీంతో ఆయన నియామకాన్ని ఆపివేసింది. ఈ పరిణామం నిమ్మగడ్డకు షాకింగ్ గా మారింది.

హైకోర్టు ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను పునర్నియామకం చేస్తూ బాధ్యతలు స్వీకరించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి.. శనివారం వాటిని వెనక్కి తీసుకున్నారు.  దీంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు షాక్ తగిలింది.

రాష్ట్రఎన్నికల సంఘం హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం 317 సర్య్కూలర్ లో నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా ప్రకటించింది. అయితే నేడు ఆ సర్క్యూలర్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎస్ఈసీ కార్యదర్శి పేరుతో జీవో జారీ అయ్యింది. అయితే జగన్ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళతాననడం.. ఆయన నియామకాన్ని ఆపివేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మేరకు హైకోర్టుకు కూడా నిమ్మగడ్డపై సుప్రీం కోర్టుకు వెళుతున్నామని.. ఆయన నియామకం ఇప్పుడే చేయలేమని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
Tags:    

Similar News