ఏపీకి గవర్నర్ రెఢీ.. రాజ్ భవన్ ఎక్కడ?
విభజన తర్వాత ఐదేళ్లకు పైనే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉండటం తెలిసిందే. దీంతో.. హైదరాబాద్ నుంచి ఏదైనా కార్యక్రమంలో పాల్గొనటం కోసం బెజవాడకు రావటం.. ఆ కార్యక్రమం పూర్తి కాగానే.. వెంటనే విజయవాడకు వెళ్లే ఫ్లైట్ లో వెళ్లిపోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఏపీకి కొత్త గవర్నర్ ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
కొత్తగా వస్తున్న గవర్నర్ కు ఏపీలో ఎక్కడ రాజ్ భవన్ ను ఏర్పాటు చేయాలన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గవర్నర్ రెఢీ అయ్యారు కానీ.. ఆయన ఉండేందుకు అవసరమైన రాజ్ భవన్ గా దేన్ని సిద్ధం చేయించాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణం పూర్తి కావటానికి చాలా సమయం ఉన్న నేపథ్యంలో.. రాజ్ భవన్ ను ఎంపిక చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పడింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజ్ భవన్ గా గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపయోగించిన క్యాంప్ ఆఫీసును వాడే అవకాశం ఉందంటున్నారు. అయితే.. బాబు ఉపయోగించిన క్యాంప్ ఆఫీసు కార్యాలయంగా ఓకే కానీ.. నివాసంగా మాత్రం ఉండటానికి అనువుగా ఉండదంటున్నారు. ఒకవేళ ఆ భవనాన్ని గవర్నర్ కార్యాలయంగా ఏర్పాటు చేస్తే.. నివాసంగా మరో భవనాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది.
దీంతో.. గవర్నర్ నివాసానికి సంబంధించి కొత్త భవనాన్ని వెతికే పనిలో ఉన్నారు ఏపీ అధికారులు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం గవర్నర్ ప్రస్తుతం బాబు క్యాంప్ ఆఫీసును వినియోగించే వీలుందని.. ఆయన నివాసం ఉండటానికి వేరే భవనాన్ని తీసుకుంటారని చెబుతున్నారు. అయితే.. ఈ అంశంపై తుది నిర్ణయం తాజాగా గవర్నర్ గా ఎంపికైన బిశ్వభూషణ్ హరిచందన్ కు వదిలేస్తారని.. ఆయన అభిరుచికి తగ్గట్లు ఏర్పాట్లు జరుగుతాయంటున్నారు. ఏమైనా ఏపీకి ఇప్పుడు గవర్నర్ ఉన్నారు.. కానీ.. ఆయన నివాసం ఉండేందుకే అవసరమైన రాజ్ భవన్ లేని పరిరిస్థితి. సంపన్నులు ఉండే రాష్ట్రంలో.. ప్రధమ పౌరుడి నివాసానికి ఇల్లు వెతుక్కోవాల్సి వచ్చిందే.