ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ మరో షాక్!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముసురుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. ఎన్నికలు నిర్వహిస్తామని తొలుత వైఎస్ జగన్ సర్కార్ ముందుకెళ్లగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అర్ధాంతరంగా ఆపేశాడు. ఆ తర్వాత ఎంత కథ జరిగిందో అందరికీ తెలిసిందే..
తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించడానికి పూనుకున్నాడు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా లేమంటూ తేల్చిచెప్పింది.
ఇలా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్థానిక ఎన్నికలపై రగడ సాగుతూనే ఉంది. తాజాగా స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడం కుదరదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఫిబ్రవరిలో జరగాల్సిన స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరగా అందుకు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఎస్ఈసీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కౌంటర్ ను దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషనర్ కు సూచించింది.
గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషనర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా సాగుతోంది. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రాలేదని, దీంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ దేశంలో వివిధ చోట్ల కోవిడ్ నిబంధనలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఏపీలోనూ నిబంధనలను అనుసరించి స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎలక్షన్ కమిషనర్ పేర్కొంటున్నారు. దీంతో ఈ పంచాయితీ కోర్టుకు వెళ్లింది.తాజాగా కోర్టు ఎలక్షన్ కమిషన్ కే అనుకూలంగా తీర్పునిచ్చింది.