విజయవాడ ఏసీపీకి ఏపీ హైకోర్టు షాక్ .. ఏం జరిగిందంటే ?

Update: 2021-07-17 06:25 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అధికారులు హైకోర్టుతో చీవాట్లు తింటున్న ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే ఇద్దరు ఐఏఎస్ అధికారులకు వారం రోజుల జైలుశిక్ష విధించిన సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఐపీఎస్ అధికారి హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల జైలుశిక్ష విధించింది.ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీట్ వేయాలని ఏసీపీకి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, ఆయన ఆ ఆదేశాలు పాటించలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీట్ వేయాలని ఏసీపీ శ్రీనివాసరావుకు గతంలో హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా ఆ ఆదేశాలు పాటించలేదు. దీనితో తమ ఆదేశాలు పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే . ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో తీర్పు అమలును.. హైకోర్టు వారంపాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

కోర్టు ధిక్కరణ కేసులో గతవారం ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏప్రిల్ నెలలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా అధికారులు పట్టించుకోలేదు. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అయితే తమ సర్వీసును పరిశీలించి శిక్ష తగ్గించాలని వారు విన్నవించుకోవడంతో సమయంలో ముగిసేవరకు కోర్టు హాల్లోనే కూర్చోవాలని ఆదేశాలు ఇచ్చింది.


Tags:    

Similar News