అనలిస్టుల ఒపీనియ‌న్‌: జ‌గ‌న్‌కు ఛాన్స్ ఇస్తోందెవ‌రు.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. జ‌నాల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. ప‌రామ‌ర్శ యాత్ర‌లు చేస్తున్నారు.;

Update: 2026-02-07 23:30 GMT

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. జ‌నాల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. ప‌రామ‌ర్శ యాత్ర‌లు చేస్తున్నారు. దీనికి భారీ ఎత్తున జ‌నాన్ని కూడ‌గ‌డుతున్నారు. ఇవ‌న్నీ.. కూట‌మి స‌ర్కారుకు ఇబ్బందిగానే మారాయి. వ‌ద్ద‌ని అంటే.. ప్ర‌జాస్వామ్యంలో కుద‌ర‌దు. అలాగ‌ని వ‌దిలేస్తే.. స‌ర్కారుపై వ్య‌తిరేకత పెరుగుతోంది కాబ‌ట్టి త‌మ నాయ‌కుడికి అండ‌గా ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తే.. జ‌నాలు వ‌స్తున్నార‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. ఈ ప‌రిణా మాల‌తో కూట‌మి పార్టీలు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో అస‌లు జ‌గ‌న్‌కు ఛాన్స్ ఇస్తోందెవ‌రు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. దీనిలో ప్ర‌ధానం గా మూడు అంశాలు క‌నిపిస్తున్నాయి.

1) కూట‌మి నాయ‌కుల వ్య‌వ‌హారం: కూట‌మి నాయ‌కులు వ్య‌వ‌హ రిస్తున్న తీరు కార‌ణంగా వైసీపీ నాయ‌కులు ఎదురు దాడి చేస్తున్నారు. త‌ద్వారా ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్నాయి. దీనికి అంబ‌టి రాంబాబు ఇంటిపై జ‌రిగిన దాడే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఆ రోజు ఇంత పెద్ద ధ‌ర్నా కాకుండా.. న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి అంబటి ఇంటి ముందుకు భైటాయిస్తే ఇంత పెద్ద ర‌గ‌డ ఉండేది కాదు.

2) ప్రొవొకేషన్‌: వైసీపీని రెచ్చ‌గొట్టే ధోర‌ణిని అవ‌లంభిస్తుండ‌డం. వాస్త‌వానికి వైసీపీని ప్ర‌జ‌లు ఎప్పుడో దూరం పెట్టారు. 151 స్థానాల నుంచి 11 స్థానాల‌కు ప‌డేశారు. అప్పుడే వైసీపీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డిపోయింది. దీనిని అలానే ఉంచి ఉంటే పెద్ద ఎత్తున వైసీపీ పుంజుకునేందుకు అవ‌కాశం ఉండేది కాద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కానీ, అయిన దానికి, కాని దానికీ.. జ‌గ‌న్ జపం చేయ‌డం.. వ‌ల్లే కూట‌మి చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు వైసీపీ స్పందిస్తోంద‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

3) వైసీపీని భూస్థాపితం చేశామ‌ని చెబుతూనే.. `ఆ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. ` అనే కీల‌క వ్యాఖ్య‌ల‌ను సీఎం చంద్ర‌బాబు చేయ‌డం. అస‌లు 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైన పార్టీని ఎందుకు త‌లుచుకోవాలి? అసలు ఎందుకు.. ఆ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించాల‌న్న వాద‌న అప్ప‌ట్లోనే వినిపించింది. ఇలా.. వైసీపీ పుంజుకునేందుకు కూట‌మి నుంచే ఆయుధాలు ఇస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీనిని త‌గ్గించి.. పాల‌న‌పైనా.. చేస్తున్న సంక్షేమంపైనా.. అభివృద్ధిపైనా ప్ర‌జ‌ల్లో దృష్టి పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తే.. వైసీపీ మాటే లేకుండా పోతుంద‌న్న వాద‌నా వినిపిస్తోంది.

Tags:    

Similar News