కోర్టు మాటంటే లెక్కలేదా? ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఏపీ హైకోర్టుకు కోపం వచ్చింది. తాజాగా విచారిస్తున్న ఒక కేసులో అధికారులు అనుసరిస్తున్న వైనంపై తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనికి కారణం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు ఒక ప్రైవేటు స్థలంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రమే. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా? అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడితే.. ఆ అధికారుల్ని రక్షించటానికి ఎవరు వస్తారో తాము చూస్తామంటూ ఫైర్ అయ్యింది.
గతంలో పట్నాలో ఒక కేసులో హైకోర్టు ఆదేశాల్ని పాటించని జిల్లా న్యాయాధికారిని పిలిపించి.. అటు నుంచి అటే జైలుకు పంపారన్న విషయాన్ని గుర్తు చేసిన కోర్టు.. తమ ఉత్తర్వుల్లో ఒక్క పదాన్ని అమలు చేయకున్నా బాద్యులైన అధికారులపై చర్యలకు వెనక్కి తగ్గమని స్పష్టం చేయటం గమనార్హం.
న్యాయ వ్యవస్థను ఎలా నడపాలో తమకు తెలుసని.. బ్యూరోక్రాట్లతో ఎలా వ్యవహరించాలో తమకు తెలుసన్న సదరు కోర్టు.. తమ ఆదేశాల్ని అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కార కేసు దాఖలు చేయాలని న్యాయవాదికి సూచించింది. ఇంతలా ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయటానికి దారి తీసిన కారణం ఏమిటన్న విషయంలోకివెళితే..
చిత్తూరు జిల్లా తిరుమలాయపల్లిలో రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనుల్ని ఒక స్థలంలో అధికారులు చేపడుతున్నారు. దీనిపై స్థలం యజమాని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అక్కడ రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించకుండా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ తమ స్థలంలో భవన నిర్మాణాన్ని చేపట్టారని.. ఆ స్థలం సర్వే నెంబరు ఆన్ లైన్ లో కనిపించకుండా అధికారులు తొలగించినట్లుగా కోర్టుకు వెల్లడించారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన హైకోర్టు.. ఘాటు వ్యాఖ్యలు చేసింది.