రాజకీయ పార్టీలకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్ట్..అసలు విషయమేంటంటే?
ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై విపరీతంగా చర్చ జరుగుతుంది. మాములుగా అయితే, ఇప్పటికే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సింది. కానీ, రిజర్వేషన్ల వద్ద కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఎన్నికల ప్రక్రియని ఆపేసారు. కానీ , తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులని బట్టి చూస్తే ..లోకల్ ఎన్నికల నిర్వహణ ను నిరవధికం గా వాయిదా వేసేలా కనిపిస్తుంది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులని బట్టి చూస్తే... స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదు. కానీ ఏపీలో ప్రస్తుతం రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటేసాయని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై గతంలోనే విచారణ పూర్తి కాగా.. తాజాగా మంగళవారంనాడు ఏపీ హైకోర్టు ధర్మాసనం మరోసారి ఇరు వర్గాల వాదనలు క్షణ్ణంగా విన్నది. గతంలో సుప్రీంకోర్టు కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జడ్జిమెంట్ లో 50 శాతం కంటే రిజర్వేషన్లు మించకూడదని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రస్తావించారు.
అయితే వీరి వాదనతో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ విభేదించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చని హైకోర్టు ధర్మాసనానికి తన నివేదిక ద్వారా తెలియజేసారు. ఇక ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్నఏపీ హైకోర్టు.. అన్ని పిటిషన్లపై విచారణ ముగిసిందని తెలిపింది. కానీ, తుది తీర్పును వెలువరించేందుకు ఇంకా లోతైన పరిశీలన అవసరమని భావించి తీర్పును రిజర్వులో వుంచింది. అయితే , దీనిపై ఏపీ హైకోర్ట్ ఎదో ఒకటి తేల్చగానే, వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావించి, ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా దానిపై కసరత్తులు ప్రారంభించాయి. కానీ , హైకోర్ట్ తీర్పు ని రిజర్వ్ లో పెట్టడం తో అన్ని పార్టీలు కూడా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.