ఉద్యోగులకు షాక్: జీతాల్లో కోతలు తప్పవట?

Update: 2022-01-19 14:33 GMT
ఏపీలో ఉద్యోగుల సమస్యలు తీరేలా లేవు. పీఆర్సీ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. పీఆర్సీ జీవోపై ప్రభుత్వ అభిప్రాయాన్ని సీఎస్ సమీర్ శర్మ కుండబద్దలు కొట్టారు. సీఎంను పక్కదారి పట్టించారంటూ సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీపై ఉద్యోగ సంఘాలు ఆరోపణలు గుప్పించాయి. ఈ నేపథ్యంలోనే సీఎస్ ఏం చెబుతారని ఆసక్తి కనబరిచారు.

ఈ నేపథ్యంలో సీఎస్ సమీర్ శర్మ బాంబు పేల్చారు. కరోనాతో ఏపీ ఆదాయం బాగా తగ్గిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రూ.62 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోందన్నారు. కరోనా లేకుంటే రూ.90వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్నారు. బడ్జెట్, పీఆర్సీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

పీఆర్సీ విషయంలో ప్రతి ఒక్క అంశం సీఎంకు తెలుసు అని.. రూ.17వేల కోట్ల మేర ఐఆర్ ఇచ్చామని తెలిపారు. ఐఆర్ అంటే జీతంలో భాగం కాదని.. పీఆర్సీ వల్ల గ్రాస్ సాలరీలో ఏ మాత్రం తగ్గదన్నారు. హెచ్ఆర్ఏను తగ్గిందా? పెరిగిందా? అనేది వేరే అంశమన్నారు. జీతాల్లో కోత మాత్రం పడే అవకాశమే లేదని సీఎస్ సమీర్ శర్మ వివరించారు.

గ్రాస్ శాలరీ చూస్తే జీతంలో ఏమాత్రం కోతపడదని.. పడే అవకాశమే లేదని సీఎస్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. రిటైర్ మెంట్ వయసును పెంచామని.. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు సీఎస్. 60 ఏళ్లు వచ్చినా ఫిట్ గా ఉండే పరిస్థితులు ఉన్నాయని.. అలాంటప్పుడు వారి అనుభవాలను ఎందుకు ఉపయోగించుకోడదన్నారు.
Tags:    

Similar News