జగన్ కలలు.. ఏపీలో కీలక ముందడుగు!

Update: 2020-07-18 12:10 GMT
ఏపీ సీఎం జగన్ కలలు నెరవేరే సమయం ఆసన్నమైంది. జగన్ ఏపీకి సీఎం కాగానే పాలన పరమైన ప్రక్షాళన ప్రారంభించారు. ఈ క్రమంలోనే మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను శాసనసభలో ఆమోదించారు. కానీ మండలిలో ఈ బిల్లులకు టీడీపీ అడ్డుపుల్ల వేసింది. శాసనమండలిలో బిల్లు పెట్టి నెలరోజులు గడవడంతో నిబంధనల ప్రకారం బిల్లు గవర్నర్ దగ్గరకు చేరింది.

ఇప్పుడు గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. గవర్నర్ నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రతిపక్షాలు వీటిని ఆమోదించవద్దని గవర్నర్ కు లేఖలు రాశాయి.

అయితే సీఎం జగన్ ఇప్పటికే ఏపీ గవర్నర్ హరిచందన్ ను కలిసి బిల్లుల ప్రాముఖ్యత టీడీపీ మండలిలో అడ్డుకుంటున్న తీరుపై వివరించారు. ఈ నేపథ్యంలోనే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం సరిపోతుంది.

అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏ బిల్లునైనా మండలి తిరస్కరించినా.. చర్చించకుండా వదిలేసినా నెలరోజుల తర్వాత డీమ్డ్ టు బీ పాస్ డ్ గా భావించి మండలి ఆమోదం పొందినట్లుగా సభాపతి పరిగణించి గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు.

అయితే సీఆర్డీఏ రద్దు.. మూడు రాజధానుల బిల్లులోని కొన్ని అంశాలు కేంద్రం చట్టంతో ముడిపడి ఉన్నాయి. రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం ఆమోదిస్తే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. జగన్ కల నెరవేరబోతోంది.
Tags:    

Similar News