అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ఏపీ అండ

Update: 2020-07-10 04:45 GMT
అమెరికాలో ఆన్ లైన్ కోర్సులు చదువుతున్న వివిధ దేశాల విద్యార్థులు దేశం విడిచి పోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. కరోనాతో ఇలా ఆన్ లైన్ కోర్సులను మీ దేశంలోనే ఉండి చదువుకోవాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీరికి సమయం ఇచ్చింది.

అమెరికాలో చదువుకుంటున్న వారిలో తెలుగు విద్యార్థుల సంఖ్య ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఏపీ సీఎంవో అధికారులు ఇప్పటికే ఓవర్సీస్ విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ తో మాట్లాడారు. విద్యార్థులకు సాయం చేయడంపై సూచనలు చేశారు.

అమెరికాలో తెలుగు విద్యార్థులు 47వేలమంది చదువుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 26వేల మంది ఉన్నారు. వీరి పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని వారికి అండగా ఉండాలని ఆదేశించింది.

అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా అన్ని వర్సిటీలు కోర్సులను ఆన్ లైన్ మోడ్ లోకి తాత్కాలికంగా మార్చాయి. దీంతో రెగ్యులర్ కోర్సుల్లో చేరిన విదేశీ విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశం విడిచి వెళ్లి మీ దేశాల్లో చదువుకోవాలని స్పష్టం చేశాయి.
Tags:    

Similar News