పోయిన టీడీపీ పరువు

Update: 2021-06-27 11:30 GMT
అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి కాల్చుకోవటం తెలుగుదేశంపార్టీకి ఎక్కువైపోయింది. తాజాగా జరిగిన ఓ డెవలప్మెంట్ లో టీడీపీ తన పరువు పోగొట్టుకున్నట్లయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ పదవీకాలాన్ని కేంద్రం మూడు నెలలు పొడిగించింది. ఆదిత్యనాద్ ఈనెల 30వ తేదీతో ఉద్యోగ విరమణ చేయాలి. అంటే సెప్టెంబర్ వరకు ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉండబోతున్నారు.

చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాద్ కు పొడిగింపు ఇవ్వద్దంటు టీడీపీ నేతలు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. రాజ్యసభ ఎంపి కనకమేడల రవీంద్రనాద్ తో పాటు వర్లరామయ్య లాంటి అనేక మంది సీనియర్ నేతలు ఆదిత్యకు పొడిగింపు ఇవ్వకూడదంటు డిమాండ్లు చేశారు. కనకమేడల అయితే ఏకంగా డీవోపీటీకి లేఖనే రాసేశారు. వర్ల లాంటి నేతలైతే గవర్నర్ కు లేఖలు పెట్టారు.

ఇంతకీ టీడీపీకి వచ్చిన అభ్యంతరం ఏమిటయ్యా అంటే అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆదిత్యనాద్ కూడా సహనిందుతుడట. టీడీపీ వాదన ఎలాగుందంటే బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లే ఉంది. ఆదిత్య మీదున్న కేసులను కోర్టు ఎప్పుడో కొట్టేసిందని వైసీపీ నేతలంటున్నారు. అందులోను చీఫ్ సెక్రటరీగా నియమించినపుడు లేని కేసుల గోల సర్వీసు పొడిగింపు సమయంలో ఎందుకుంటుంది.

నిజానికి ప్రభుత్వంలో ఎవరెక్కడ పనిచేయాలన్న విషయం టీడీపీకి ఏమీ సంబంధంలేదు. నియామకాలు టీడీపీ చెప్పినట్లు జగన్ చేస్తారా ? గతంలో ప్రతిపక్షాల్లో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే చంద్రబాబునాయుడు పట్టించుకున్నారా ? ప్రతిదానికి గోల చేయటం టీడీపీకి బాగా అలవాటైపోయింది. ఆదిత్యకు పొడిగింపు ఇవ్వద్దంటారు, త్రిమూర్తులుకు ఎంఎల్సీగా అవకాశం ఇవ్వకూడదని గోలచేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. తాము ఎంత డిమాండ్ చేసినా జరగని పనుల్లో కూడా వేళ్ళు పెట్టి టీడీపీ పరువు పోగొట్టుకోవటం తప్ప ఒరిగేదేమీ లేదంతే.
Tags:    

Similar News