• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డజనుమంది మంత్రులు.. 70...

డజనుమంది మంత్రులు.. 70 మంది ఎమ్మెల్యేలు.. ఆ ఏపీ సలహాదారు 'ప్రదర్శన' మామూలుగా లేదుగా?

By - Tupaki Desk
Update: 2022-03-28 10:30 GMT
రాజకీయాల్లో ఒకటనుకుంటే ఒకటవుతుంది.. అలాగే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో అంశం భలే చర్చకు వస్తోంది. పదుల కొద్దీ ఉన్న సలహాదారుల్లో ఓ సలహాదారు ప్రదర్శించిన వైభవం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల ఆ సలహాదారు ఓ పెద్ద హోటల్ లో ఏర్పాటు చేసిన వ్యక్తిగత కార్యక్రమానికి ఏకంగా దాదాపు డజను మంది మంత్రులు, 70 మంది ఎమ్మెల్యేలు హాజరయినట్లు తెలిసి ఔరా అని నోరెళ్లబెడుతున్నారు. మిగతా సలహాదారులేమో లోలోన ఆలోచనలో పడ్డారు. అసలే అవి ఏపీ రాజకీయాలు మరి? అందులోనూ అందరిలోనూ ఈ సలహాదారు చాలా చిన్నవారు. కానీ, పెద్ద పోస్టు పట్టేశారు. దీంతో మిగతావారికి కాస్త కంటగింపుగానే ఉంటుంది.

అంతమంది ప్రజాప్రతినిధులా?

ఆ సలహాదారు ఏర్పాటు చేసిన కార్యక్రమం, సందర్భం ఇక్కడ అనవసరం కానీ, అందుకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేల సంఖ్య చూస్తేనే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. సహజంగా ఏ సీఎం ఇంట్లోనో తప్ప ఈ స్థాయిలో డజను మంది మంత్రులు, 70 మంది ఎమ్మెల్యేలు హాజరుకావడం అరుదు. కానీ, ఓ సీఎం సలహాదారు నిర్వహించిన కార్యక్రమానికే ఇంతమంది ప్రజాప్రతినిధులు వెళ్లడం అంటే.. పరోక్షంగా ఇది తన ‘‘పరిచయ ప్రదర్శన’’లా కనిపించింది. అసలే రాజకీయాలు మంచిగా లేవు. అందులోనూ ప్రాంతీయ పార్టీలు వచ్చాక ఎప్పుడే కుట్ర జరుగుతుందో చెప్పలేం? నలుగురు ప్రజాప్రతినిధులు ఒక్కచోట పోగైతేనే చెవులు కొరుక్కునే కాలం. అలాంటిది ఏకంగా ఇంతమంది హాజరవడం, అందులోనూ నిఘా కళ్లు నిత్యం వెంటాడే వైసీపీ సర్కారు పాలనలో హాజరవడం మిగతావారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.

‘‘రాజకీయ’’ ఆశలతోనేనా?

ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఓ సలహాదారు ఎత్తుగడలు వేయడంలో చాలా నేర్పరి. అలానే ఆయన ఇక్కడ వరకు వచ్చారు. సాధారణ స్థాయి నుంచి ప్రయాణం మొదలుపెట్టి, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని వీడి.. అందివచ్చిన ప్రయివేటు ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకుని వైసీపీ ప్రస్తుత పెద్దలకు దగ్గరయ్యారు. ముందే చెప్పుకున్నట్లు తన ఎత్తుగడలతో ఉద్యోగంలో రాణించారు. అటు ఉద్యోగంలో ఎదుగుతూనే వైసీపీ రాజకీయ నాయకులతోనూ పరిచయాలు పెంచుకున్నారు. తాను ఉన్న పోస్టు కూడా అతడికి బాగా ఉపయోగపడింది. దాని ద్వారా తను కొంత ఆర్థికంగానూ నిలదొక్కుకునే వెసులుబాటు దొరికింది. అయితే, మొదటినుంచి జీవితంలో నిలదొక్కుకోవాలనే ఆశలున్న ఆ సలహాదారు ఉద్యోగంలో స్థిరపడ్డాక.. వైసీపీ ప్రభుత్వం రావడంతో అటువైపు అడుగులు వేశారు. మిగతావారికి భిన్నమైన పోస్టును ప్రభుత్వంలో సంపాదించారు. అధినేతకు బాగా దగ్గరని  చెప్పుకొంటూ వస్తున్నారు.

మరోవైపు ఇటీవలి అతడి ప్రయివేటు కార్యక్రమం కొంత రాజకీయ ఆలోచనలతోనే సాగిందని చెప్పొచ్చు. దానికితోడు ఏపీలో నెల కిందట ఓ యువ ప్రజాప్రతినిధి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ ఖాళీని భర్తీ చేసే దిశగా సలహాదారు ముందస్తు ప్రణాళిక వేశాడా? అన్న అనుమానం వస్తోంది. అదీ కాకుండా త్వరలో పూరించాల్సిన చట్ట సభ పోస్టును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు వేస్తున్నాడా? అని ప్రయివేటుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

సలహాలే వినని సారుకు.. లెక్కలేనంతమంది సలహాదారులు

అసలు ఏపీ సర్కారులో సలహాదారులెందరు? అంటే పదో పరకో కాదు ఓ 50 మంది ఉంటారని చెబుతారు. వీరందరికీ నెలకు కనీసం రూ.3 లక్షల పైనే జీతభత్యాలు. ఇదంతా ప్రజాధనమేనని .. వారికి అప్పనంగా కట్టబెడుతున్నారంటూ అక్కడి ప్రజలు ముఖ్యంగా యువత వాపోతుంటారు. చిత్రమేమంటే.. అసలు వేరొకరి సలహాలే వినని సారుకు ఇంతమంది సలహాదారులు ఉండడం విచిత్రమని చెవులు కొరుక్కుంటుంటారు.
Tags:    
  • Andhra Pradesh 
  • AP Government 
  • Ysrcp Party 
  • Jagan Mohan Reddy 
  • Andhra Pradesh Politics 
  • Ap Advisors 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS