దేశంలో మరో కొత్త వ్యాధి : నిన్న బ్లాక్ ఫంగస్ .. ఇప్పుడు వైట్ ఫంగస్!

Update: 2021-05-20 10:30 GMT
కరోనా వైరస్ నుండి దేశం ఇంకా పూర్తిగా కోలుకోక మునుపే , బ్లాక్ ఫంగస్ టెన్షన్ పెడుతోంది. దీనితో పలువురు చనిపోతున్నారు. అయితే , బ్లాక్ ఫంగస్ గురించి ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ తరుణంలో మరో కొత్త వ్యాధి వచ్చింది. అదే వైట్ ఫంగస్. బిహార్‌ లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయినట్లు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హెడ్ ఎస్ ఎన్ సింగ్ తెలిపారు. కరోనా మాదిరే.. వైట్ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను దెబ్బతిస్తుందని చెప్పారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మాంగాలు, నోటికి వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనా లక్షణాలతో ఉన్న నలుగురు వ్యక్తులకు పరీక్షలు చేయగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది.

కానీ వారిలో మాత్రం కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. మరోసారి హెచ్ ఆర్ సిటి పరీక్షు చేశారు. అయినప్పటికీ , కరోనా నెగెటివ్ వచ్చింది. ఈసారి మ్యూకస్ కల్చర్‌ ను పరీక్షించగా వైట్ ఫంగస్ బయటపడింది. ఊపిరితితుల్లో వైట్ ఫంగస్ ఉన్నట్లు ఉన్నట్లు తేలడంతో వెంటనే యాంటి ఫంగల్ డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం వారు కోలుకుంటున్నారని ఎన్‌ సింగ్ తెలిపారు. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రమాదమేమీ లేదని,కానీ ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తోందని ,కానీ వైట్ ఫంగస్ మాత్రం కరోనా లక్షణాలున్న వారిలో బయటపడుతోందని అన్నారు. కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించి.. కరోనా నెగెటివ్ వస్తే మాత్రం.. ఖచ్చితంగా మ్యూకస్ కల్చర్ పరీక్ష చేయించాలని వైద్యులు సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితో పాటు డయాబెటిస్ రోగులు, చాలా కాలంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు ఎక్కువగా వైట్ ఫంగస్ బారినపడే అవకాశహుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కరోనా , బ్లాక్ ఫంగస్ తో అల్లాడిపోతున్న దేశ ప్రజలకి వైట్ ఫంగస్ మరో కొత్త టెంక్షన్ ను తీసుకొచ్చింది. కాబట్టి అందరూ తప్పక జాగ్రత్తలు పాటించండి.
Tags:    

Similar News