మళ్లీ సేమ్ సీన్ రిపీట్..మూడు రాజధానులపై విచారణ వాయిదా - మరో బెంచ్ కి బదిలీ!

Update: 2020-08-19 09:50 GMT
మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు పైన ప్రభుత్వం చేసిన చట్టాల పైన ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీచేయడంతో , దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. విచారణ కూడా మొదలుపెట్టింది. కానీ , సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కుమార్తె అమరావతి రైతుల తరపున వాదిస్తుండటం తో , ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును నాట్ బిఫోర్ మీ అంటూ మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ కేసు ఈరోజు జస్టిస్ నారీమన్ బెంచ్ మీదకు వచ్చింది.

అయితే, ప్రభుత్వ అప్పీల్ కు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి పిటీషన్ దాఖలు చేసింది. రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి హాజరయ్యారు. దీంతో..నారీమన్ ఈ కేసును మరో బెంచ్ కు వాయిదా వేయాలంటూ నాట్ భిపోర్ మీ అంటూ కేసును వాయిదా వేసారు. దీంతో ఈ కేసు వేరే బెంచ్ కు బదిలీ కానుంది. ఈ నేపథ్యంలో విచారణను మరోసారి వాయిదా వేశారు. ఒకే కేసులో సుప్రీంలో వరుసగా రెండో సారి ఈ విధంగా జరగటం అరుదైన విషయంగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే , ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వం చేసిన చట్టాల పైన ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం మూడు రాజధాని బిల్లు, సీఆర్డీఏ కు గవర్నర ఆమోదంతో చట్టాలుగా మారుస్తూ గజెట్ విడుదల కూడా చేసింది. దీని పైన రైతులు హైకోర్టులో ఈ చట్టాల అమలు నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మొదట ఈ నెల 14వ తేదీ వరకు ఆ చట్టాలు అమలు కాకుండా స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఆ పిటీషన్ కు సమాధానంగా కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసాయి. కాగా, తిరిగి 14న ఈ పిటీషన్ తో పాటుగా రాజధాని అంశం పైన దాఖలైన పిటీషన్ల పైన విచారణ చేసిన హైకోర్టు ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో ను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కి వెళ్లగా ..అక్కడ విచారణ జరగకుండానే రెండు బెంచ్ ల నుండి బదిలీ అయింది. 
Tags:    

Similar News