హైదరాబాద్ లో బయటపడ్డ మరో డ్రగ్స్ దందా

Update: 2020-09-09 04:45 GMT
ముంబై వయా కర్ణాటక మీదుగా ఈ డ్రగ్స్ దందా హైదరాబాద్ లో కూడా తాజాగా బయటపడింది. అమీర్ పేట్ లో మరో డ్రగ్స్ గ్యాంగ్ పట్టుబడింది. ముగ్గురు వ్యక్తుల వద్ద ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంటి గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిసింది.

బంటి ముఠా సభ్యుల నుంచి 46 గ్రాముల పిల్స్, 2 గ్రాముల ఎండీఎంఏ, 10 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. బంటీతోపాటు రోహిత్,నవీన్ రాజ్ అనే ముగ్గురు గోవా వెళ్లినట్లు తెలిసింది.

విచారణలో గోవాకు చెందిన కునాల్, రఫీ పరార్ అనే ఇద్దరు సభ్యుల ముఠా బంటీకి ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక వీరిని అదుపులోకి తీసుకొని ఎవరెవరికి డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారనేది కూపీ లాగుతున్నారు.
Tags:    

Similar News