ముంచుకొస్తున్న మరో రోగం.. ఈ వ్యాధి కేవలం మగాళ్లకు మాత్రమే!

Update: 2020-11-10 05:15 GMT
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవర పెడుతున్న వేళ.. మరో కొత్త రోగం ముంచుకొస్తున్నది.  ఈ వ్యాధి కేవలం మగవాళ్లకు మాత్రమే వస్తున్నది. ఈ కొత్త మహమ్మారి ఇప్పటికే అమెరికాలో వ్యాపించిందని.. పలువురు ఈ రోగం బారిన పడ్డారని సమాచారం. అమెరికాలో ఇప్పటికే వందలమంది ఈ రోగం బారిన పడ్డారట.  నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, జ్వరం వచ్చి తగ్గిపోతుండటం, ఊపిరితిత్తుల సమస్య లాంటి సమస్యలు 40 శాతం మందిలో కనిపిస్తున్నాయట. ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారి వచ్చి ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఈ జబ్బును గురించి కనుగొన్నారు. దీనికి వెక్సాస్ అనే పేరు పెట్టి పరిశోధనలు మొదలుపెట్టారు. 2,  500మంది నుంచి సమాచారం సేకరించి వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నారు.

 ‘ఈ సమస్యతో వస్తున్న చాలా మంది పేషెంట్లకు చికిత్స అందించలేకపోతున్నాం’ అని ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ డాక్టర్​ డేవిడ్ బీ బెక్ అంటున్నారు. ‘అందుకే మేం లక్షణాలపై ఫోకస్ పెట్టకుండా రివర్స్‌లో వెళ్తున్నాం. జెనెటికల్‌గా స్టడీ చేసి సమస్య తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని ఆయన చెప్పారు. 22 మంది ఒకే లక్షణాలతో పాటు ఒకే పరివర్తన ఉన్నవాళ్లను గుర్తించారు. వారిలోనూ బ్లడ్ క్లాట్ అవడం, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపించాయి. వెక్సాస్ అనే జబ్బుపై రీసెర్చ్ టీం ఫోకస్ పెట్టింది. ఈ వ్యాధి  X క్రోమోజోమ్ తో లింక్ అయి ఉంది. మగాళ్లలో x క్రోమోజోమ్ ఒక్కటే ఉండటంతో వారికి ఈ వ్యాధి సోకుతున్నది.  మహిళల్లో రెండు x క్రోమోజోములు ఉండటం వల్ల వారికి ఈ రోగం రావడం లేదని వైద్యలు ప్రాథమికంగా నిర్ణయించారు. జెనోమ్ ఫస్ట్ టెక్నిక్‌తో ఈ వ్యాధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
Tags:    

Similar News