సమర్థంగా మోడెర్నా వ్యాక్సిన్.. 94.5 శాతం సక్సెస్
విశ్వ మానవాళికి మరో గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ తమ కరోనా వ్యాక్సిన్ విజయవంతం అయినట్టు ప్రకటించగా.. అదే అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ సంస్థ ‘మోడెర్నా’ కరోనా వ్యాక్సిన్ పై తాజాగా కీలక ప్రకటన చేసింది.
మోడెర్నా రూపొందించిన ఎంఆర్ఎన్ఏ-1273 వ్యాక్సిన్ సమర్థవంతగా పనిచేస్తున్నట్లు తెలిపింది. తమ వ్యాక్సిన్ 94.5శాతం సమర్థతతో పనిచేస్తోందని మోడెర్నా వెల్లడించింది.
దాదాపు 30వేల మంది వలంటీర్లపై మోడెర్నా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ విశ్లేషణలో 94.5శాతం సమర్థతతో వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు మోడెర్నా వెల్లడించింది.
వ్యాక్సిన్ పరిశోధనాభివృద్ధి కోసం మోడెర్నాకు దాదాపు 7వేల కోట్ల (1 బిలియన్ డాలర్లు) ఆర్థిక సాయాన్ని అమెరికా ప్రభుత్వం అందించింది. ఇందులో భాగంగా 10 కోట్ల డోసులను అమెరికాకు అందించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ 90శాతం సమర్థతతో పనిచేస్తుందని తెలుపగా.. అంతకంటే మించి మోడెర్నా వ్యాక్సిన్ పనితీరు కనబరించిందని తెలిపింది.
ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ వేగంగా పూర్తయితే వచ్చే నెలలోనే అమెరికాలో అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్ లు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. అమెరికా అవసరాలు తీరితే భారత్ కు ఈ వ్యాక్సిన్ అందే అవకాశాలున్నాయి.