నూతన ఎన్నికల కమిషనర్‌గా అనూప్‌ చంద్ర !

Update: 2021-06-09 04:30 GMT
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ గా కొత్త వ్యక్తి నియమితులయ్యారు. కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్‌ గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనూప్‌ చంద్ర పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. అనూప్‌ చంద్ర 1984 బ్యాచ్‌ ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌ అధికారి. ఆయన నియామకంతో ఎన్నికల సంఘంలో పూర్తిస్థాయిలో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. ప్రస్తుతం సుశీల్‌ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాగా, రాజీవ్‌ కుమార్‌ మరో సభ్యుడిగా ఉన్నారు. అనూప్‌ చంద్ర గతంలో యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గా పనిచేసిన సునీల్‌ అరోరా ఈ ఏడాది ఏప్రిల్‌ 12న పదవీ విరమణ చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది.

ఏప్రిల్‌ 12 న పదవీ విరమణ చేసిన నాటి నుంచి, ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఒక కమిషన్‌ పదవి ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈ స్థానాన్ని అనూప్‌ చంద్ర పాండేతో భర్తీ చేశారు. ఎన్నికల సంస్కరణపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సీఈసీ సుశీల్ చంద్ర కేంద్రానికి లేఖ రాసిన రోజే కొత్త కమిషనర్ నియామకం జరగడం గమనార్హం. అనూప్ చంద్రపాడే నియామకంతో ఈసీ ఇప్పుడు ముగ్గురు కమిషనర్లతో నిండుకుంది. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనూప్ చంద్ర పాండే గతంలో డిప్యూటేషన్ పై రక్షణ శాఖ అదనపు కార్యదర్శిగా, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.
Tags:    

Similar News