వైసీపీ-టీడీపీ.. మధ్యలో బీజేపీ.. పాలి`ట్రిక్స్` అంటే ఇవే కదా!
ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తే.. ఇదే తరహా.. పరిస్థితి కనిపిస్తోంది. `వైసీపీ-టీడీపీ.. మధ్యలో బీజే పీ` అనే మాటే వినిపిస్తోంది. అటు అధికార పక్షం వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలతో బీజేపీ అను సరిస్తున్న వైఖరి.. చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. అధికారంలో ఉన్న వైసీపీ ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిందే. గత 2019లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కించుకున్న ఈ పార్టీ బలమైన పక్షంగా ఏర్పడి అధికారం దక్కించుకుంది. అయితే.. ఈ పార్టీకి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ మద్దతు చాలా అవసరం గా మారడం గమనార్హం.
వాస్తవానికి ఏపీ బీజేపీకి ఎంత బలం ఉందో తెలిసిందే. 2014లో పొత్తులో భాగంగా నాలుగు అసెంబ్లీ స్థానా లు.. ఒక ఎంపీ స్థానాన్ని గెలిపించుకున్న బీజేపీ.. 2019లోకి వచ్చేసరికి మాత్రం ఒంటరి పోరుతో చతికిల పడింది. దీనిని బట్టి బీజేపీకి ఎంత ఓటు బ్యాంకు ఉందో అర్ధమవుతుంది. అదేసమయంలో ఇటీవల జరిగి న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. సో.. దీనిని బట్టి క్షేత్రస్థా యిలో బీజేపీకి ప్రజా మద్దతు ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. అయినప్పటికీ.. వైసీపీ మాత్రం.. బీజేపీని పట్టుకుని వేలాడుతోంది.
దీనికి రాష్ట్ర అభివృద్ధి విషయంలో వైసీపీకి కేంద్రం సహకారం అవసరం కాబట్టి.. బీజేపీతో చెలిమి చేస్తోం దని భావించాలి. అదేసమయంలో రరాజకీయంగా 2014 నాటి పరిస్థితిని పునరావృతం కాకుండా చూసుకు నే పరిస్థితి కూడా వైసీపీకి అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే.. ఆ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ చెలిమి చేసిన కారణంగా వైసీపీకి కీలక స్థానాల్లో విజయం దూరమైంది. ఇప్పుడు అది పునరావృతం అయితే.. మళ్లీ వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఈ పార్టీ నేతలు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే.. టీడీపీకి చేరువ కాకుండా.. బీజేపీతో చెలిమి చేస్తున్నట్టు స్ఫష్టమవుతోంది.
నిజానికి ఇప్పుడు ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలోకేంద్రం ఏమాత్రం సహకరించడం లేదు. అయినప్పటికీ.. చెలిమి మాత్రం తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే.. మరోవైపు.. టీడీపీ కూడా బీజేపీతో మళ్లీ చెలిమికి సిద్ధంగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీని దూరం చేసుకోబట్టే.. తాము ఓడిపోయే పరిస్థితి వచ్చిందని.. టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒకరకంగా..కేంద్రంలోని పెద్దలను మచ్చిక చేసుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. అందుకే.. కొందరు రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీలోకి పంపించిందనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది.
అదేసమయంలో చంద్రబాబుకు రాజకీయంగా కేంద్రం పెద్దల అవసరం ఎంతైనాఉంది. ఈ నేపథ్యంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా నోరు ఎత్తేందుకు సాహసించడం లేదు. నిజానికి ఇప్పుడు కేంద్రంపై పోరుచేసేందుకు , మోడీని గద్దె దింపేందుకు.. ఇతర ప్రతిపక్షాలు.. ఏకం అవుతున్నా యి. ఈ విషయంలో బీజేపీయేతర రాష్ట్రాలు ఒకే మాటపై ఉండగా.. ఏపీలో మాత్రం వైసీపీ, టీడీపీలు మాత్రం దూరంగా ఉన్నాయి. దీనినే.. బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుని.. ఏమాత్రం పట్టు లేక పోయినా.. ఏపీ విషయంలో రాజకీయాలను వేడెక్కిస్తోందనే వాదన వినిపిస్తోంది. దీంతో టీడీపీ-వైసీపీ మధ్యలో బీజేపీ రాజకీయ ట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.