జీఎస్టీ వసూళ్లలో ఇరగదీసిన ఏపీ.. దక్షిణాదిన అగ్రస్థానం!
ప్రభుత్వాలు తమకు తోచిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయంటే కారణం.. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే. ప్రభుత్వం ఏదైనా సరే.. ప్రజలు చెల్లించే పన్నులతోనే పాలిస్తుందన్న విషయం అందరికీ తెలిసినా.. మహమ్మారి విరుచుకుపడిన నేపథ్యంలో ప్రభుత్వాలకు వచ్చే పన్ను ఆదాయం దారుణంగా పడిపోయింది. దీంతో.. పలు ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. గడిచిన కొన్నేళ్లుగా పలు రాష్ట్రాల పన్ను ఆదాయాల్ని చూస్తే.. అంతకంతకూ పెరగటమే తప్పించి తగ్గే పరిస్థితి ఉండదు. అలాంటి వాటికి భారీగా దెబ్బ తీసింది మాయదారి వైరస్.
మార్చిలో దారుణంగా పడిన రాష్ట్ర పన్ను ఆదాయాలు.. ఏప్రిల్ లో కాస్త మెరుగుపడితే.. మే ఫర్లేదనిపించింది. జూన్ విషయానికి వస్తే.. గడిచిన మూడు నెలలకు జరిగిన నష్టం.. భవిష్యత్తులో అంత ఇంతో రికవరీ అవుతుందన్న ఆశల్ని కల్పించింది. వస్తు సేవల పన్ను వసూళ్లకు సంబంధించి జూన్ వివరాలు వెల్లడయ్యాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గడిచిన మూడు నెలలుగా నీరసించిన పన్ను ఆదాయాల పరిస్థితిలో మార్పు వచ్చింది.తాజాగా రూ.90,917 కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే తగ్గినా.. గడిచిన మూడు నెలలతో పోల్చినప్పుడు మెరుగైన పరిస్థితి నెలకొందని చెప్పక తప్పదు.
జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ లో కేవలం రూ.32,294 కోట్లు మాత్రమే. మేలో పరిస్థితి కాస్త మెరుగుపడి రూ.62,009 కోట్లకు చేరుకుంది. జూన్ లో పరిస్థితి మెరుగుపడి సాధారణ స్థాయి దిశగా అడుగులు వేస్తున్నట్లుగా చెప్పాలి. గత జూన్ తో పోలిస్తే 9 శాతం ఆదాయం తగ్గినట్లుగా చెబుతున్నారు. కేంద్రం పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయమే బాగుందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గడిచిన మూడు నెలలతో పోలిస్తే.. జూన్ లో ఏపీలో ఆరు శాతం పన్నువసూళ్లు పెరిగితే.. తెలంగాణలో మూడు శాతానికి మాత్రమే పరిమితం కావటం గమనార్హం. ఆ మాటకు వస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక పన్ను రాబడి ఏపీలో ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. సౌత్ లో ఏపీ అగ్రస్థానంలో ఉంటే.. చివరి స్థానంలో కర్ణాటక నిలిచింది. ఆ రాష్ట్రంలో జూన్ లో కేవలం ఒక శాతం మాత్రమే ఆదాయం పెరిగినట్లు చెబుతున్నారు. వసూళ్లు బాగా తగ్గిన రాష్ట్రాల్లో తమిళనాడు 15 శాతంతో వెనుకబడి ఉంటే.. కేరళలో రెండు శాతం వసూళ్లు తగ్గినట్లుగా తేల్చారు.
ఇదిలా ఉంటే.. ఏ మాత్రం ఊహించని విధంగా కొన్ని రాష్ట్రాలు పన్ను వసూళ్లను భారీగా పెంచుకున్నాయి. ఈ జాబితాలో ఊహించనిరీతిలో అండమాన్ లో 160 శాతం పెరిగితే.. సిక్కింలో 79 శాతం.. నాగాలాండ్ లో 63 శాతం పెరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏమైనా సంక్షోభ సమయంలో పన్ను వసూళ్ల ఆదాయం పెరిగిన రాష్ట్రాల్లో ఏపీ ముందుండటం ఆ రాష్ట్రానికి శుభవార్తగా చెప్పక తప్పదు.