ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. ఏపీ ‘కోటి’ రికార్డు మీద మీ మాటేంటి?

Update: 2021-06-02 11:30 GMT
ప్రతి విషయాన్ని వంకరగా చూడటం అలవాటుగా మారింది. చిన్న విషయాన్ని భూతద్దం వేసి చూడటమే కాదు.. దాన్ని మరింత భారీగా గ్లోరిఫై చేసి పెను భూతంలా మార్చే రోగం ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కువైంది. తమకు వ్యతిరేకం అన్న ఒకే ఒక్క కారణంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం.. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయటం ఇప్పుడు ఎక్కువైంది. వ్యాక్సిన్ కొరత దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ.. ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు విమర్శల్ని సంధించటం తెలిసిందే.

ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక జగనే ఉన్నట్లుగా ఫీలయ్యే వారి సంగతిని పక్కన పెడితే.. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో టీకాలు వేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ యావరేజ్ ను ఏపీ అలవోకగా దాటేయటమే కాదు.. తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి.. రెండో డోస్ తీసుకున్న వారు కోటి దాటేశారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే 1,00,17,712 మందికి వ్యాక్సిన్ అందించినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.

ఇందులో మొదటి డోస్ తీసుకున్న వారు 74.92 లక్షలు కాగా.. సెకండ్ డోస్ తీసుకున్న వారు 25.24 లక్షలు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించానికి వ్యాక్సినేషన్ కు మించిన మార్గం మరొకటి లేదన్న విషయాన్ని గ్రహించిన ఏపీ సర్కారు టీకా కార్యక్రమం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో కోవీషీల్డ్.. కోవాగ్జిన్ వ్యాక్సిన్లు రాష్ట్రానికి ఎప్పటికప్పుడు వచ్చేలా ప్లాన్ చేయటమే కాదు.. వచ్చిన వ్యాక్సిన్ వచ్చినట్లుగా ప్రజలకు అందించే విషయంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయటంతో తాజా రికార్డు సొంతమైందని ప్రభుత్వం చెబుతోంది. అదే పనిగా జగన్ సర్కారుపై ఆడిపోసుకునే వారంతా ఇప్పుడేమంటారో?
Tags:    

Similar News