జపాన్ రుణానికీ ఎదురు చూపులే
నవ్యాంద్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న మెట్రో కారిడార్ కు రుణ సదుపాయం కల్పిస్తున్న జపాన్ కు చెందిన జైకా సంస్థ రుణం కోసం కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మెట్రో రైల్ కారిడార్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు ఇవ్వడంలో జాప్యం కారణంగానే ఆ రుణం అందుకోవడానికి మరో ఆరు నెలలు ఆలస్యం అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర విభజన చట్టం మేరకు విజయవాడకు మెట్రోను మంజూరు చేసినా సవాలక్ష కొర్రీలు వేసింది. డీఎంఆర్సీ - ఏఎంఆర్షీ పలు వివరణలు ఇచ్చినా సంతృప్తి చెందలేదు. చివరకు పూర్తిస్థాయిలో వివరణలు పంపిన తర్వాత దానిపై ఎటువంటి నిర్ణయం వెలువరించకుండా, ఆమోదం తెలపకుండా గమ్మునుంది. అనుమతులు ఇవ్వడంలో కేంద్రం జాప్యానికి తెర వెనుక కొంతమంది ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బందరు రోడ్డులో కారిడార్ డైవర్షన్, ఏలూరు రోడ్లులో స్థలాలు పోయే వారి ఆందోళనలు, వారికి కొమ్ము కాసే కొంతమంది ప్రజా ప్రతినిధుల కారణంగానే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నారు. కేవలం అనుమతులు ఇవ్వడంలోనే కాదు.. మెట్రో రైలు కారిడార్ కు తనవంతు నిధులను ఇవ్వడంలో కూడా కేంద్రం ఆలస్యం చేస్తోంది. అయితే, సాంకేతిక కారణాలతోనే అనుమతులు జాప్యం అవుతున్నాయని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
అమరావతి మెట్రోకు రూ.3600 కోట్లు ఇవ్వడానికి జైకా సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా తక్కువ వడ్డీకే ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే కేంద్రం నుంచి తుది అనుమతులు వచ్చిన తర్వాతనే ఈ విషయంలో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది.