గురజాడ ఇంటికి గుర్తించారు

Update: 2015-05-24 06:34 GMT
తెలుగువాళ్లకు ఉన్న భావ దారిద్య్రం మరే జాతికి ఉండదేమో. తమ ముందు తరంలోని ఎందరో మహానుభావుల్ని ఏ మాత్రం పట్టించుకోని వారు ఎవరైనా ఉన్నారంటే తెలుగు ప్రజలే. తమ వారసత్వానికి ప్రత్యేకంగా గుర్తించటం.. వాటికి జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో పాలకులే కాదు.. ప్రజలకు పట్టని పరిస్థితి. ఈ కారణంగానే.. ఎన్నో చారిత్రక ఆధారాలు.. ఆవశేషాలు అడ్రస్‌ లేకుండా పోయాయి.

ఇంకా నిలిచి ఉన్న వాటి విషయంలో ఇప్పుడిప్పుడే కాస్తంత జాగ్రత్త పెరుగుతోంది. రాజకీయంగా టీఆర్‌ఎస్‌ పార్టీని తప్పు పట్టచ్చు కానీ.. ఆ పార్టీకి సంబంధించి ఒక చక్కటి అంశం ఉంది.

చరిత్ర.. చారిత్రక అంశాల పట్ల ఆ పార్టీ ప్రత్యేకశ్రద్ధ చూపుతుంది. నిజానికి ఆ అంశమే తెలంగాణ ప్రజల్ని ఏకం చేసిందనుకోవాలి. మరి.. టీఆర్‌ఎస్‌ నుంచి నేర్చుకున్నారో లేక మరే ఇతర కారణమో కానీ.. ఎట్టకేలకు.. ఏపీ సర్కారు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంది.

మహాకవిగా.. ఆధునిక భావాలున్న వ్యక్తిగా ప్రఖ్యాత గురజాడ అప్పారావు నివసించిన ఇంటికి విశిష్ఠ గుర్తింపు ఇస్తూ ఏపీ సర్కారు ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన నివసించిన ఇంటిని పురావస్తు కట్టడంగా గుర్తించినట్లు పురావస్తు శాఖ తాజాగా ఒక ప్రకటన చేసింది. విజయనగరంలోని గరజాడ ఇంటిని చారిత్రక కట్టడంగా గుర్తిస్తూ పురావస్తు శాఖ గెజిట్‌లో వెల్లడించింది. కాస్త ఆలస్యమైనా.. ఏపీ సర్కారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లే.


Tags:    

Similar News