ఇసుక కష్టం..రాతిని ఇసుకుగా మార్చి..!
టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఏపీలో ఇసుక తవ్వకాలు జరిగేవి. ప్రధానంగా అధికార టీడీపీ నేతలు - మంత్రుల కనుసన్నల్లో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు - ఆరు కాయలుగా వర్ధిల్లాయనే విమర్శలు వెల్లు వెత్తాయి.. ఇక గ్రామాలు, పట్టణాల్లో సమీప నదులు - వాగులు - సముద్రం నుంచి ఇసుకను తీసుకొచ్చుకొని ప్రజలు - వ్యాపారులు గృహ నిర్మాణాలు చేసుకునేవారు. దీని వల్ల టీడీపీ నేతలు కోట్లకు పడగలెత్తారనే విమర్శలున్నాయి. ప్రకృతి సంపదను అప్పనంగా హరించివేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్న ఇసుక తవ్వకాలను - ఇసుక రవాణాను నిషేధించి కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కేవలం 102 రీచ్ లలోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. కేవలం 48 నిల్వ కేంద్రాల ద్వారానే ఇసుక అమ్ముతున్నారు. ఇది ఏపీ వ్యాప్తంగా ఏ మూలకు సరిపోని పరిస్థితి. రోజుకు ఏకంగా 35వేల టన్నుల ఇసుక డిమాండ్ ఏర్పడింది. ఇక ఇప్పటివరకు ఏపీలోని నిర్మాణాలకు బల్క్ గా భారీగా ఇసుక కావాలి మహా ప్రభో అంటూ ఏకంగా ఏపీ మైనింగ్ శాఖ ఏపీ ఎండీసీకి 1760 దరఖాస్తులు రావడం గమనార్హం. 12 లక్షల టన్నుల ఇసుక కావాలంటూ వీరు కోరారు. రోజుకు లక్ష టన్నుల చొప్పున తవ్వకాలు జరపాలని ఆదేశించారు.
అయితే వైసీపీ సర్కారు మాత్రం డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా చేయలేక ఆపసోపాలు పడుతోంది. దీని వల్ల ఏపీలో నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతింటోంది. ఇక ఏపీ ఇసుక కష్టాలు చూసిన జనసేనాని పవన్ త్వరలోనే ఏపీలో నిరసన ర్యాలీలకు ప్లాన్ చేయడం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వ్యవహారంగా మారింది.
ఇసుక లభ్యత తక్కువగా ఉండడం.. గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో ఇసుకకు ప్రత్యామ్మాయంగా ఏపీలో రాతి ఇసుకను అందుబాటులోకి తేవాలని ఏపీ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కంకర క్వారీలు అందుబాటులో ఉండడంతో వీటి ద్వారా రాతి ఇసుకను సిద్ధం చేయించి అవసరమైన వారికి సరఫరా చేయడంపై దృష్టిపెట్టింది. దీని ఉత్పత్తి దారులకు సబ్సిడీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
ఇలా ఏపీలో ఇసుక కష్టాలు పీక్ స్టేజికి చేరుకున్నాయి. నిర్మాణాలు పడిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యామ్మాయంగా ఇసుకకు బదులు రాతి ఇసుకను వాడుకలోకి తీసుకురావడానికి ఆపసోపాలు పడుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.